అక్క‌లా భ‌ర్త‌కి సేవ‌లు చేయ‌ను: ఖుషీ క‌పూర్

అతిలోక సుంద‌రి శ్రీదేవి న‌ట వార‌సురాళ్లుగా జాన్వీ క‌పూర్, ఖుషి క‌పూర్ ఇప్ప‌టికే సినీ రంగ ప్ర‌వేశం చేశారు.

Update: 2025-01-27 14:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీదేవి న‌ట వార‌సురాళ్లుగా జాన్వీ క‌పూర్, ఖుషి క‌పూర్ ఇప్ప‌టికే సినీ రంగ ప్ర‌వేశం చేశారు. జాన్వీ క‌పూర్ బాలీవుడ్ లో ప‌లు సినిమాలు చేసి గ‌తేడాది దేవ‌ర సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమానే ఎన్టీఆర్‌తో చేయ‌డం వ‌ల్ల త‌ర్వాత కూడా మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే జాన్వీ తెలుగులో త‌న రెండో సినిమాను రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌నుంది.

ఇదిలా ఉంటే శ్రీదేవి లాగే జాన్వీకి, ఖుషికి కూడా తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి అంటే విప‌రీత‌మైన భ‌క్తి. శ్రీదేవి ప్ర‌తి పుట్టిన‌రోజుకి జాన్వీ కాలి నడ‌క‌న తిరుప‌తి కొండ ఎక్కి మ‌రీ స్వామి వారిని ద‌ర్శించుకుంటూ ఉంటుంది. అంతేకాదు జాన్వీకి ఖాళీ దొరికితే చాలు తిరుమ‌ల స్వామి వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లొస్తూ తిరుమ‌ల‌పై, స్వామి వారిపై త‌నకున్న భ‌క్తిని చాటుకుంటూ ఉంటుంది.

రీసెంట్ గా జాన్వీ పెళ్లి గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కు తిరుప‌తిలో పెళ్లి చేసుకోవాల‌ని ఉంద‌ని, భ‌ర్త‌కు సేవ చేసుకుంటూ పిల్ల‌ల్ని చూసుకుంటూ రోజూ ఆ గోవింద నామం వింటూ కాలం వెళ్ల‌దీయాల‌నుంద‌ని చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే. జాన్వీ చేసిన ఆ కామెంట్స్ పై రీసెంట్ గా జాన్వీ సోద‌రి ఖుషీ క‌పూర్ స్పందించింది.

ఖుషి నటించిన ల‌వ్ యాపా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఖుషి క‌పూర్ త‌న పెళ్లి గురించి, త‌న అక్క జాన్వీ క‌పూర్ పెళ్లిపై చేసిన కామెంట్స్ గురించి మాట్లాడింది. త‌న‌కు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాల‌నుంద‌ని, అక్క లానే త‌న పెళ్లి కూడా తిరుప‌తిలో జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పిన ఖుషి, పెళ్లయ్యాక త‌న తండ్రి బోనీ క‌పూర్ కూడా త‌మ‌తోనే ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపింది.

త‌ను, త‌న భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు, పెంపుడు కుక్క‌లు వీటితో త‌న జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటాన‌ని ఖుషి చెప్పింది. అయితే త‌న అక్క భ‌ర్త‌కు సేవ చేసిన‌ట్టు తాను మాత్రం చేయ‌న‌ని, త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి కూడా పెళ్లి అంటే ఎంతో గౌర‌వ‌ముంద‌ని తెలిపింది. ఇక సినిమా విష‌యానికొస్తే ల‌వ్ యాపా సినిమా త‌మిళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ల‌వ్ టుడే కి రీమేక్ గా తెర‌కెక్కింది. ఫిబ్ర‌వ‌రి 7న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:    

Similar News