కిచ్చా సుదీప్ ఆ నిర్ణయం వెనక రీజన్ అదేనా..?
అంతేకాదు బిగ్ బాస్ కోసం తాను ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితాన్ని అందుకోవట్లేదని.. అందుకే బిగ్ బాస్ కి తాను గుడ్ బై చెప్పాలని అనుకున్నా అని అన్నారు సుదీప్.
శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చారు. హిందీ బిగ్ బాస్ తర్వాత సౌత్ లో మొదట మొదలు పెట్టింది బిగ్ బాస్ కన్నడలోనే. దాదాపు 10 సీజన్లుగా సుదీప్ హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఈమధ్యనే మొదలైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 11కి కూడా సుదీప్ హోస్ట్ గా చేస్తున్నారు. ఐతే సీజన్ 11 తన చివరిది అని.. బిగ్ బాస్ సీజన్ 12కి తాను హోస్ట్ గా చేయనని ఆమధ్య ప్రకటించారు సుదీప్.
సుదీప్ ఆ నిర్ణయం పట్ల బిగ్ బాస్ ఆడియన్స్ తో పాటు సుదీప్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. ఐతే సుదీప్ అసలు ఎందుకు బిగ్ బాస్ షో చేయకూడదు అనుకున్నారో రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. బిగ్ బాస్ కన్నడ మిగతా బాషల కన్నా ఎక్కువ రేటింగ్ తెచ్చుకోలేకపోతుంది. అందుకే తను హోస్ట్ గా చేయకూడదు అనుకుని వచ్చిన ఆలోచనని ప్రకటించానని అన్నారు. ఐతే ఎలాగు ప్రకటించేశాం కాబట్టి ఆ మాట మీద నిలబడేందుకు దాన్ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు సుదీప్.
అంతేకాదు బిగ్ బాస్ కోసం తాను ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితాన్ని అందుకోవట్లేదని.. అందుకే బిగ్ బాస్ కి తాను గుడ్ బై చెప్పాలని అనుకున్నా అని అన్నారు సుదీప్. కిచ్చా సుదీప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆడియన్స్ మాత్రం డిజప్పాయింట్ గా ఉన్నారు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ మ్యాక్స్ సినిమా చేస్తున్నాడు. విజయ్ కార్తీకేయ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కళైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు కిచ్చ సుదీప్ సుపరిచితుడే.. ఈగ సినిమాలో ఆయన విలన్ గా నటించిన విషయం తెలిసిందే. బాహుబలి 1 లో కూడా సుదీప్ నటించాడు. ఐతే సుదీప్ కు తెలుగు నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా ఆయన ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాడు. సుదీప్ కన్నడ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఐతే రాబోతున్న మ్యాక్స్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. బిగ్ బాస్ హోస్ట్ గా కిచ్చ సుదీప్ కి సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ ఏర్పడింది. తెలుగు బిగ్ బాస్ ని చాలా సందర్భాల్లో కన్నడ బిగ్ బాస్ తో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు.