ఎల్ 2 ఎంపురాన్ ఇది ఊహించని షాక్..!

అందుకే ఎల్ 2 ఎంపురాన్ కి తెలుగు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.;

Update: 2025-03-30 03:11 GMT
ఎల్ 2 ఎంపురాన్ ఇది ఊహించని షాక్..!

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఎల్ 2 ఎంపురాన్. లూసిఫర్ సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కించారు. లూసిఫర్ సినిమాకు సౌత్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎల్ 2 ఎంపురాన్ సినిమాను పాన్ ఇండియాన్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా లూసిఫర్ సినిమాకు తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఎల్ 2 ఎంపురాన్ కి తెలుగు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఐతే సినిమా రిలీజ్ బజ్ బాగున్నా ఫస్ట్ షో నుంచే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. పృధ్విరాజ్ డైరెక్షన్, మోహన్ లాల్ యాక్టింగ్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నా తెలిసో తెలియకో ఈ సినిమా రియల్ పొలిటికల్ జోన్ లోకి వెళ్లింది. సినిమాలో ప్రతినాయకుడు పేరుతో పాటు కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ పై ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అందుకే సినిమా మీద వీటి ఎఫెక్ట్ పడకూడదు అనే ఉద్దేశంతో రిలీజైన రెండో రోజే 17 సీన్స్ ని కట్ చేసి ఆ వెర్షన్ ని థియేటర్ లో వచ్చేలా చేశారు. పేపర్ మీద రాసుకున్న పాత్ర ఎవరిని ఉద్దేశించి రాసుకుంటామన్నది తెలియదు కానీ తెర మీదకు వచ్చే సరికి ఫలానా వాళ్లని పోలి ఈ పాత్ర ఉందంటూ నానా యాజిగి చేస్తుంటారు. ఐతే మోహన్ లాల్ స్వతహాగా తన సినిమా గురించి ఇలాంటి అనవసరమైన విషయాలను ఇన్వాల్వ్ చేయరు. అందుకే నిర్మాత ఎల్ 2 ఎంపురాన్ నుంచి 17 సీన్స్ కట్ చేశారు.

ట్రిమ్ చేసిన వెర్షన్ ప్రస్తుతం ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అంతేకాదు సినిమాలో ఓపెనింగ్ సీన్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నందుకే ఆ సీన్స్ ని కూడా ట్రిం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎల్ 2 ఎంపురాన్ నుంచి నిర్మాలు 17 సీన్స్ ట్రిం చేసి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు.

ఈమధ్య స్టార్ సినిమాలకు ఇలాంటివి చాలా ఎక్కువ అయ్యాయి. కథ లో పాత్ర దాని తాలూకా స్వభావం ఇవన్నీ ఏమి ఆలోచించకుండా వివాదాలను సృష్టిస్తారు. లూసిఫర్ టైం లో ఇలాంటివి ఏమి జరగలేదు కానీ ఎల్ 2 సినిమా టైం లో మాత్రం ఆడియన్స్ నుంచి కొన్ని నిరసనలు వ్యక్తం కాగా వాటికి రెస్పాండ్ గా కొన్ని సీన్స్ ట్రిం చేసి కొత్త వెర్షన్ ని ప్లే అయ్యేలా చేశారు నిర్మాతలు.

Tags:    

Similar News