నిత్యామీనన్ తో ఆప్యాయత అదో అసభ్యత!
ఈ నేపథ్యంలో తాజాగా మాలా పార్వతి తనకెదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
మలయాళం ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతో మంది బాధిత మహిళలు మీడియా ముందుకొచ్చి తమ బాధని చెప్పుకునే ప్రయత్నం చేసారు. ఇండస్ట్రీలో మహిళల పట్ల ఎలాంటి దాష్టికాలకు తెగబడతారు? అన్నది మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మాలా పార్వతి తనకెదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అదేంటో ఆమె మాటల్లోనే.. 2010లో నేనొక సినిమా చేసా. అందులో నా కూతురు పాత్రలో నిత్యామీనన్ నాన్సీగా నటించింది.
నిత్య నాచుట్టూ తిరిగి సరదాగా ఆడుకునే సన్నివేశం అది. నా భర్త పాత్ర పోషించిన పాద్రధారి నాన్సనీని ఆప్యాయంగా టచ్ చేయాలి. అయితే ఆ వ్యక్తి నాన్సీని ఓ చేతితో ఆప్యాయతతో టచ్ చేసినట్లు నటించాను తాను సుఖం పొందినట్లు కనిపించింది. మరో చేతితో నన్ను కూడా టచ్ చేసి ఇబ్బంది పెట్టాడు. ఆ ఒక్క సీన్ లోనే కాదు. ఆ సినిమా మొత్తం అలాగే జరిగింది. నాకు చాలా నొప్పిగా అనిపించేది. ఆ తర్వాత దర్శకుడు శిబీమలైయిల్ టచ్ సీన్ లేకుండా కొన్ని టేక్ లు చేసారు. కానీ అదే వ్యక్తితో ఒకరి పక్కన మరొకరు కూర్చోవడం, హత్తుకోవడం వంటి సన్నివేశాలున్నాయి.
దీంతో నాకు ఆ సినిమా ఓ టార్చల్ లా అనిపించింది. హత్తుకోవడం పేరుతో అతడు తప్పుగా ప్రవర్తించినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. నాకు అసౌకర్యంగా ఉండటంతో ఆ సినిమాలో సరిగ్గా నటించలే కపోయాను. మానసికంగా, శారీరకంగానూ ఎంతో ఇబ్బంది పడ్డాను. మరో సినిమా షూటింగ్ కోసం నా సొంత ఖర్చుతో కార్వాన్ తెచ్చుకున్నాను. అయితే ఓ రాత్రి నా కార్వాన్ వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతు న్నాయని ఫోన్ వచ్చింది. నా కార్వాన్ దగ్గరకు వెళ్లే అక్కడ కాకుండా ఓ చెట్టు దగ్గర కార్వాన్ ఉంది.
నేను అక్కడికి వెళ్తుంటే బౌన్సర్లు నన్ను చూసి పారిపోయారు. అక్కడే ఉన్న అమ్మాయిలను నేను తీసుకు వచ్చాను. ఈ సంఘటన గురించి ఓ సీనియర్ నటుడికి చెబితే నువ్వు ఏమైనా సామాజిక కార్యకర్తవా? నటివా? అని అడిగాడు. ఇలాంటి వారి వల్లే మహిళలకు భద్రత లేకుండా పోతుంది` అని అన్నారు.