మ్యాడ్ స్క్వేర్.. ఈసారి బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

అదే ఆసక్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నంగా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.;

Update: 2025-03-26 08:52 GMT
మ్యాడ్ స్క్వేర్.. ఈసారి బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

కొత్త హీరోలతో రూపొందిన చిన్న సినిమా మ్యాడ్ రెండు సంవత్సరాల క్రితం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. కామెడీ, ఫ్రెష్ న్యారేషన్, యూత్ ఫన్‌ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్‌పై బోలెడంత ఆసక్తి పెరిగింది. అదే ఆసక్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నంగా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

మొదటి పార్ట్ కేవలం 2.50 కోట్ల బిజినెస్‌తో థియేటర్లలో అడుగుపెట్టి, అంచనాలు లేకుండా రూ.9.60 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మాత్రం అంచనాలను బాగానే పెంచేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సీక్వెల్ వరల్డ్‌వైడ్‌గా దాదాపు 21 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను పూర్తి చేసింది. ఇది ముందు సినిమాతో పోల్చితే ఎనిమిదింతలు ఎక్కువ.

తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో ఈ సినిమాకు 6.50 కోట్ల బిజినెస్ జరగ్గా, ఆంధ్రాలో 7 కోట్లకు పైగా బిజినెస్ నమోదైంది. సీడెడ్‌లో కూడా 2 కోట్ల మేరను సొంతం చేసుకుంది. మొత్తం కలిపితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మాత్రమే 15.5 కోట్ల వరకు బిజినెస్ జరగడం విశేషం. సౌత్‌లో చిన్న హీరోల సినిమాకు ఇంత రేంజ్‌లో బిజినెస్ జరగడం అరుదైన విషయం.

వాస్తవానికి ఇలా బిజినెస్ పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మ్యాడ్ ఫస్ట్ పార్ట్ క్రేజ్, రెండోది సమ్మర్ సీజన్. ప్రస్తుతం థియేటర్లలోని వాతావరణం కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉంది. ఓవర్సీస్‌లో కూడా 3.5 కోట్ల బిజినెస్ సాధించడం విశేషం. రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్‌లో కూడా 2 కోట్ల మేర రెవెన్యూ వచ్చిందంటే, యూత్ ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.

అయితే, ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలంటే కనీసం 22 కోట్ల వరకు షేర్ సాధించాల్సి ఉంటుంది. ఇదే సమ్మర్ రేసులో నితిన్ ‘రాబిన్ హుడ్’, మోహన్ లాల్ ‘ఎల్ప్ 2 ఎంపురాన్’ లాంటి సినిమాలు కూడా బరిలో ఉండటంతో పోటీ తక్కువగా లేదు. అయినా, మ్యాడ్ స్క్వేర్‌కి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తే, యూత్ మాజిక్‌కి బ్రేక్ ఉండదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ సీక్వెల్ మ్యాడ్‌గా మళ్ళీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? అనేది ఈ వీకెండ్ కు స్పష్టమవుతుంది.

Tags:    

Similar News