మ్యాడ్ స్క్వేర్ 'స్వాతి రెడ్డి'.. ఊపు ఊపేస్తోందిగా!

యూత్‌ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ మూవీ.. భారీ వసూళ్లను రాబట్టింది.

Update: 2024-12-28 14:55 GMT

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యూత్‌ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ మూవీ.. భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ఫస్ట్ పార్ట్ లో యాక్ట్ చేసిన రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్.. సీక్వెల్ లో కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు మించిన ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి రెడీ అవుతున్నారు. కళ్యాణ్ శంకరే సీక్వెల్ ను కూడా డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మూవీ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో మేకర్స్.. ప్రమోషన్స్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మ్యాడ్ హిట్ అవ్వడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'లడ్డు గాని పెళ్లి' సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు అదే జోష్ తో రెండో సాంగ్ 'స్వాతి రెడ్డి'ని రిలీజ్ చేశారు మేకర్స్. ఓ ఊపు ఊపుతున్న పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించారు. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సింగర్ స్వాతి రెడ్డితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. తన మ్యూజిక్ తో సత్తా చాటారు భీమ్స్ సిసిరోలియో. మరో మంచి సాంగ్ అందించారు.

అయితే సాంగ్ లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ ఉత్సాహం బాగా కనిపించింది. హీరోయిన్ రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని సాంగ్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌ దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మరి ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజ్ అవ్వనున్న మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.



Full View


Tags:    

Similar News