మంచు ప్ర‌దేశాల్లో మాస్ జాత‌ర‌!

ఆయ‌న మాస్ ఇమేజ్ ని ఏ మాత్రం త‌గ్గించ‌కుండా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీలీల‌ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. `ధ‌మాకా`తో ఈ కాంబినేష‌న్ స‌క్సెస్ అయింది.

Update: 2024-12-15 00:30 GMT

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ క‌థానాయ‌కుడిగా భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో `మాస్ జాత‌ర` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్. ర‌వితేజ మార్క్ లో సాగే చిత్రం. ఆయ‌న మాస్ ఇమేజ్ ని ఏ మాత్రం త‌గ్గించ‌కుండా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీలీల‌ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. `ధ‌మాకా`తో ఈ కాంబినేష‌న్ స‌క్సెస్ అయింది. దీంతో మ‌రోసారి అదే క‌ల‌యిక‌లో రెండ‌వ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ నార్వేలో జ‌రుగుతోంది. ఇటీవ‌లే అక్క‌డ కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మైంది. దీనిలో భాగంగా అక్క‌డ కొన్ని కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట కూడా చిత్రీక‌రి స్తున్నారుట‌. మంచు అందాల్లో ఆ పాట సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. ఆ పాట రొమాంటిక్ గానూ ఉంటుందిట‌. అంటే! ర‌వితేజ‌-శ్రీలీల మ‌ధ్య రొమాంటిక్ అప్పిరియ‌న్స్ హైలైట్ అవుతుంద‌ని తెలుస్తుంది.

రొమాంటిక్ సాంగ్ కాబ‌ట్టి డాన్సు ప‌రంగా ర‌వితేజ లీల‌తో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. లేదంటే ఆ బ్యూటీతో డాన్స్ అంటే హీరోల‌కు స‌వాల్ త‌ప్ప‌దు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ సైతం శ్రీలీల‌తో డాన్స్ చేయ‌డం అంటే హీరోల‌కు తాట ఊడిపోతుంద‌ని చేతులెత్తేసిన‌వారే. ర‌వితేజ కూడా సూప‌ర్ డాన్స‌ర్ కాదు. ఆయ‌న‌కు త‌గ్గ స్టెప్పుల్నే కొరియోగ్రాఫ‌ర్స్ కంపోజ్ చేస్తారు. ధ‌మాకాలో జీడి గింజ‌లు పాట ఎంత హైలైట్ అయిందో తెలిసిందే.

మరి అలాంటి మాస్ పెప్పీ సాంగ్ మాస్ జాత‌ర‌లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ర‌వితేజ‌కు 75వ సినిమా. ల్యాండ్ మార్క్ చిత్రం. ఈ మ‌ధ్య కాలంలో రాజా సినిమాల‌న్ని డిజాస్ట‌ర్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో అంచ‌నాల‌తో సినిమాలు చేస్తున్నా అవి బాక్సాఫీస్ వ‌ద్ద తుస్సు మంటున్నాయి. మ‌రి `మాస్ జాత‌ర` విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి. పైగా ల్యాండ్ మార్క్ సినిమా కావ‌డంతో హిట్ అవ్వాల‌ని అభిమానులంతా బ‌లంగా కోరుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది మే 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:    

Similar News