వరుస ఫ్లాప్స్ పడ్డా 'లక్కీ మీనాక్షి'
2021లో ఇచ్చట 'వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
2021లో ఇచ్చట 'వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఆ సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా అందంతో పాటు నటనతో మెప్పించింది. లక్కీగా త్రివిక్రమ్‌తో పాటు సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడికి 2024లో పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయి. ఈ ఏడాది మీనాక్షి చౌదరి నటించిన ఆరు సినిమాలు వచ్చారు. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా విడుదల కాగా ఆ తర్వాత పలు సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగులో ఈమె దుల్కర్ సల్మాన్‌తో నటించిన లక్కీ భాస్కర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, నటిగానూ మంచి మార్కులు సొంతం చేసుకుంది.
ఈ ఏడాది మొత్తం ఆరు సినిమాల్లో తెలుగులోనే ఈమె నటించిన నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో లక్కీ భాస్కర్ సినిమా మినహా గుంటూరు కారం, మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా ఈమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. సినిమాల్లో ఈమెకు ఆఫర్లు తెచ్చి పెడుతూనే ఉన్నాయి. కోలీవుడ్‌లో ఈ అమ్మడు ది గోట్ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అక్కడ కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఈమె టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ బిజీగా కనిపించబోతుంది.
టాలీవుడ్‌లో 2025లో సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. మరో వైపు నవీన్ పొలిశెట్టి దర్శకత్వంలోనూ అనగనగా ఒకరాజు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఒకటి రెండు సినిమాలు కోలీవుడ్‌లోనూ చేసేందుకు రెడీ అవుతోంది. హిందీ నుంచి ఈమెకు ఆఫర్లు వస్తున్నాయని, కానీ మొత్తం దృష్టి సౌత్ సినిమాలపైనే అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాదిలో ఆరు సినిమాలతో వచ్చిన మీనాక్షి చౌదరి వచ్చే ఏడాదిలో అంతకు మించి అన్నట్లుగా సినిమాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో మరో రెండు మూడు హిట్ కొట్టినా స్టార్ హీరోల జాబితాలో ఈ అమ్మడు చేసే అవకాశాలు ఉన్నాయి. వరుసగా ఫ్లాప్స్ పడ్డా మంచి సినిమాల్లో, క్రేజీ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుందనే విశ్వాసంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ మీనాక్షి చౌదరికి మంచి క్రేజ్ ఉంది.