'మిరాయ్' సంక్రాంతి స్పెషల్ చూశారా!
గత ఏడాది సంక్రాంతికి 'హనుమాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజా సజ్జా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
గత ఏడాది సంక్రాంతికి 'హనుమాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజా సజ్జా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి మరీ తేజ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. హనుమాన్ సినిమా తర్వాత తేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తాడని అంతా భావించారు. కానీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. హనుమాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు 'మిరాయ్' సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ సమ్మర్‌లో మిరాయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజ సజ్జాను నెక్ట్స్ లెవల్ యాక్షన్స్‌తో చూడబోతున్నామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. గత ఏడాది కాలంగా ఊరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి పోస్టర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. గాల్లో ఎగురుతున్న తేజ సజ్జాను ఈ పోస్టర్‌లో చూడవచ్చు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని ఈ పోస్టర్‌ను చూస్తే ఉంటే అర్థం అవుతుంది. మిరాయ్ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 18న తెలుగుతో పాటు అన్ని పాన్ ఇండియా భాషల్లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హిందూ దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం అందుతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెలుగులో వచ్చిన సినిమాలకు మంచి స్పందన దక్కుతున్న ఈ సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మరోసారి అదే తరహా కాన్సెప్ట్‌తో రాబోతున్న నేపథ్యంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా పోస్టర్స్‌తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. అంచనాలు భారీగా పెరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హనుమాన్ సినిమాతో హిట్ దక్కించుకున్న తేజ సజ్జా అంతకు ముందు కూడా వరుసగా విజయాలను సొంతం చేసుకున్నాడు. కనుక ఈ సినిమాతో మరో విజయాన్ని తేజ సజ్జా తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాతో తేజా సజ్జా హీరోగా మరింతగా స్టార్‌డం దక్కించుకుంటాడేమో చూడాలి. ఇక హనుమాన్ కి సీక్వెల్‌గా రూపొందుతున్న జై హనుమాన్ సినిమాలోనూ తేజ సజ్జా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమా కోసం కాంతార స్టార్ రిషబ్ శెట్టితో కలిసి తేజ సజ్జా వర్క్ చేయబోతున్నాడు.