మోక్షజ్ఞ డెబ్యూ… అందుకే 999 ఆగిందా?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా రీసెంట్ గా ఎనౌన్స్ అయ్యింది.

Update: 2024-09-17 05:51 GMT

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా రీసెంట్ గా ఎనౌన్స్ అయ్యింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ కథాంశం ఏంటనే సమాచారం బయటకి రాలేదు.

ఈ చిత్రం కచ్చితంగా మోక్షజ్ఞ లాంచింగ్ కి పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ గానే ఉంటుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. నిజానికి మోక్షజ్ఞ డెబ్యూ తన నిర్మాణంలోనే ఉంటుందని బాలయ్య గతంలో ప్రకటించారు. ‘ఆదిత్య 369’కి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ మూవీ చేస్తానని తెలిపారు. ఆ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉటుందని అన్నారు. అయితే ఎందుకనో తరువాత ‘ఆదిత్య 999’ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు.

బాలయ్య ఆలోచనలో అయితే ఈ మూవీ ప్లానింగ్ ఉంది. కానీ ఎప్పుడనేది క్లారిటీ లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ కాకుండా మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా లాంచ్ చేయడానికి వేరే కారణం ఉందనే మాట వినిపిస్తోంది. ‘ఆదిత్య 999’ మూవీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఉండబోతోందంట. ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని భావిస్తున్నారు. మొదటి సినిమాతోనే భారీ బడ్జెట్ అంటే మోక్షజ్ఞ లాంచింగ్ రాంగ్ అవుతుందని బాలయ్య అనుకున్నారని టాక్.

ఈ నేపథ్యంలో ముందుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మినిమమ్ బడ్జెట్ కథ ద్వారా లాంచ్ చేస్తే పాన్ ఇండియా లెవల్ లో మోక్షజ్ఞకి మంచి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. రెండు, మూడు ప్రాజెక్ట్స్ తర్వాత స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ‘ఆదిత్య 999’ సినిమాని మోక్షజ్ఞతో తెరకెక్కించినా పెద్ద రిస్క్ ఉండదని బాలయ్య ఆలోచించారనే మాట వినిపిస్తోంది.

అందుకే మోక్షజ్ఞ డెబ్యూగా ‘ఆదిత్య 999’ ఉండాలనే నిర్ణయాన్ని బాలయ్య మార్చుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం అవుతోంది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ చేయబోయే సినిమాకి 50 నుంచి 70 కోట్ల మధ్యలో బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞకి జోడీగా హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారని సమాచారం.

Tags:    

Similar News