రెండు రోజులు ఏడు సినిమాలు
మూవీకి పాజిటివ్ టాక్ వస్తే వేగంగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకోవచ్చనేది దర్శక, నిర్మాతల ఆలోచన.
కొన్నిసార్లు సినిమాలు లేక థియేటర్స్ మూత పడాల్సి వస్తోంది. ఇక కొన్ని ప్రత్యేకమైన తేదీలలో అయితే గంపగుత్తగా మూవీస్ ప్రేక్షకుల ముందుకొస్తాయి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ఉన్న ప్రైమ్ డేట్స్ ప్రతి ఏడాదిలో కొన్ని ఉంటాయి. ఆ రోజుల్లో తమ సినిమాలని రిలీజ్ చేయాలని అన్ని భాషలలో దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. లాంగ్ వీకెండ్ అయితే ఎక్కువ ప్రేక్షకాదరణ లభిస్తుంది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే వేగంగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకోవచ్చనేది దర్శక, నిర్మాతల ఆలోచన.
అలాగే ఈ ఏడాది ఆగష్టు 15 ఇండిపెండెంట్స్ డేతో లాంగ్ వీకెండ్ దొరికింది. అందుకే ఈ డేట్ న ఎక్కువ సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో కొన్నింటికి ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి. తెలుగు, హిందీ భాషల నుంచి రేపు ఎక్కువ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. తెలుగులో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది.
రవితేజ నుంచి వస్తోన్న మిస్టర్ బచ్చన్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జోనర్ లో తెరకెక్కింది. బన్నీ వాస్ నిర్మాణంలో రెడీ అయిన కంప్లీట్ కామెడీ ఎంటెర్టైన్మెంట్ మూవీ ఆయ్ రేపే రిలీజ్ అవుతోంది. నార్నె నితిన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూడు సినిమాలపైనే తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. ఇక హిందీలోకి వస్తే జాన్ అబ్రహం నుంచి కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా వేద వస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
అలాగే శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ పాత్రలలో తెరకెక్కిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ 2 భారీ అంచనాల మధ్యలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సూపర్ హిట్ మూవీ స్త్రీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతోంది. అక్షయ్ కుమార్ నుంచి ఖేల్ ఖేల్ మే అనే కామెడీ థ్రిల్లర్ మూవీ ఇండిపెండెంట్స్ డే రోజునే రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో వాణి కపూర్, తాప్సి లాంటి స్టార్ యాక్టర్స్ ఉండటంతో కొద్దిగా అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇక తమిళంలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ రఘు తాత రేపే థియేటర్స్ లోకి వస్తోంది.
ఓవరాల్ గా తెలుగు, హిందీ, తమిళ్ లో కలిపి మొత్తం 7 సినిమాలు ఇండిపెండెంట్స్ డే స్పెషల్ గా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మిస్టర్ బచ్చన్ సినిమా ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ తో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. అలాగే ఆయ్ మూవీ ప్రీమియర్స్ ఆగష్టు 15న ఎర్లీ మార్నింగ్ షోలుగా వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాలన్నీ కూడా ఏదో ఒక విధంగా క్రేజ్ ఉన్నవే. వీటిలో ఎన్ని ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటాయనేది వేచి చూడాలి.