మరో క్రేజీ సీక్వెల్ లో మృణాల్.. గోల్డెన్ ఛాన్స్..

తెలుగు సినిమాల్లో ఇటీవల క్రేజీ ఆఫర్స్ అందుకొని ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన స్థాయిని పెంచుకుంటోంది

Update: 2025-01-17 02:45 GMT

తెలుగు సినిమాల్లో ఇటీవల క్రేజీ ఆఫర్స్ అందుకొని ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన స్థాయిని పెంచుకుంటోంది. దుల్కర్ సల్మాన్ సరసన ‘సీతారామం’లో నటించిన మృణాల్ సాలీడ్ సక్సెస్ సాధించిన తరువాత బాలీవుడ్ వైపు మరింత దృష్టి పెట్టింది. ఓ వైపు తెలుగులో చేస్తూనే నార్త్ లోను బిజీ అవ్వాలని అనుకుంది.

తెలుగులో చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అనంతరం పాన్ ఇండియా మూవీ కల్కిలో ఒక స్పెషల్ పాత్రతో మెప్పించింది. ఇక మళ్ళీ కొంత కాలం అనంతరం కొన్ని కథలు విన్నప్పటికి పెద్దగా నచ్చలేదట. రీసెంట్ గా అడివి శేష్ తో డెకాయిట్ సినిమాకు ఓకే చెప్పింది.

అలాగే ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న ఒక సినిమాలో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి కానీ ఇంకా సరైన క్లారిటీ రాలేదు. ఇక లేటెస్ట్ గా, మృణాల్ ఠాకూర్ మరో బిగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘సన్ ఆఫ్ సర్దార్’కి సీక్వెల్‌ రూపొందనుంది, ఇందులో మృణాల్ ప్రధాన పాత్రలో నటించనుందట.

2012లో విడుదలైన ‘సన్ ఆఫ్ సర్దార్’ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మర్యాద రామన్న’కు రీమేక్‌గా తెరకెక్కింది. అజయ్ దేవగణ్ నటనతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అజయ్ దేవగణ్ తన గత పాత్రను తిరిగి చేస్తుండగా, ఈ సీక్వెల్‌లో కథలో కొత్త పంథా, కొత్త పాత్రలను చేరుస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో నటించిన సోనాక్షి సిన్హాను కాదని ఈసారి మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

లిస్టులోకి మృణాల్ పేరు రాగానే సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మృణాల్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది. ‘సూపర్ 30,’ ‘జెర్సీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన మృణాల్, ఇప్పుడు అజయ్ దేవగణ్‌తో కలిసి నటించడం తన కెరీర్‌కి పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు. తన ప్రతి పాత్రలో కొత్తదనాన్ని చూపిస్తూ, బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది మృణాల్.

సీక్వెల్‌ కథను మరింత కామెడీ ట్విస్ట్ లతో మిక్స్ చేయనున్న మేకర్స్‌ త్వరలోనే కీలక అప్డేట్ ఇవ్వనున్నారు. గత సినిమాను మించి ఈసారి కథలో కొత్త మలుపులు, వినోదం, కుటుంబ అనుబంధాలు పుష్కలంగా ఉంటాయని సమాచారం. చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ చిత్రం 2025 జూలై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News