ప్రభాస్ - హను.. మ్యూజిక్ డైరెక్టర్ అతడే..

రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సలార్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు

Update: 2023-12-05 06:30 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సలార్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సలార్ ట్రైలర్ ఇప్పటికే విడుదల కాక ఓ వర్గం వారిని అయితే అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తప్పకుండా బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ మెప్పిస్తాడు అని ఫాన్స్ నమ్మకంతో ఉన్నారు.

ఇక మరోవైపు ప్రభాస్ కల్కి తో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మళ్లీ వచ్చే ఏడాదిలోనే రాబోతున్నాయి. అలాగే ప్రభాస్ సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా చేయడానికి చర్చలు జరుపుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో రానున్న ఈ సినిమా కథ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు హను ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు మంచి సింక్ ఉండడంతో బెస్ట్ అవుట్ ఫుట్ ఇస్తారు అని ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇంతకుముందు ఈ కాంబినేషన్లో పడి పడి లేచే మనసు, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలు వచ్చాయి. అందులో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా అతనినె ఫిక్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం సంగీత దర్శకుడికి బెస్ట్ చాన్స్ అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఇప్పటివరకు ఈ రేంజ్ లో విశాల్ చంద్రశేఖర్ కు సరైన అవకాశాలు రాలేదు. మరి ఈ అవకాశాన్ని అతను ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను వచ్చే ఏడాది మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. కల్కి సినిమా షూటింగ్ అయితే చివరి దశలో ఉంది. ఇక ఆ తర్వాత మారుతి సినిమాను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయబోయే ప్రభాస్ అనంతరం హను రాఘవపూడి ప్రాజెక్టుతో బిజీ కానున్నాడు.

Tags:    

Similar News