అందరి హాస్పిటల్ బిల్లులు నేనే కడతా
సూపర్ హిట్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్వ్కేర్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది.;

సూపర్ హిట్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్వ్కేర్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముగ్గురు యువకులు గోవా వెళ్లి చేసే రచ్చ ఎలా ఉంటుందనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ లాంచ్ లో భాగంగా నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడి వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
అందరూ టికెట్ రేట్లు పెంచారు అంటున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో కూడా చాలా హంగామా చేస్తున్నారు కానీ ఈ టికెట్ రేట్ల పెంపు వ్యవహారం చాలా మందికి అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పండుగ సీజన్, పైగా వీకెండ్. దానికి తోడు నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. దీంతో పోటీ ఎక్కువగా ఉంది.
కావాల్సినన్ని థియేటర్లు దొరకడం కూడా కష్టంగానే ఉంది. ఇంత పోటీ మధ్య సినిమాను రిలీజ్ చేస్తున్నప్పుడు టికెట్ రేట్లు సినిమా కలెక్షన్లపై కచ్ఛితంగా ప్రభావం చూపుతాయని, అయినా టికెట్ రేట్లు పెంచింది ఆంధ్రాలోని బీ, సీ సెంటర్లలో మాత్రమేనని, టికెట్ రేటు రూ.100 ఉన్న చోట మాత్రమే దాన్ని మరో రూ.50 పెంచామని, మిగిలిన అన్ని ఏరియాల్లో మామూలు రేట్లే అమల్లో ఉన్నాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇదే ఈవెంట్ లో ట్రైలర్ చూశాక మీడియాలో ఉన్న మేమే కడుపుబ్బి నవ్వాం. నార్మల్ ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. మూవీ చూశాక అందరూ నవ్వి నవ్వి కడుపునొప్పితో హాస్పిటల్ లో చేరి ఆ బిల్లుల్ని మిమ్మల్నే కట్టమంటారేమో అని ఒక జర్నలిస్ట్ అడగ్గా దానికి నాగవంశీ అలా జరిగితే ఎంతమంది హాస్పిటల్ బిల్లులైనా నేనే కడతా అని చెప్పాడు.
ఇదే సందర్భంగా తమ బ్యానర్ లో త్రివిక్రమ్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రానున్న సినిమా పై కూడా నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. బన్నీ- త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా ఈ ఇయర్ సెకండాఫ్ లో ఆ మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పి బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు నాగవంశీ.