డ‌బుల్ హ్యాట్రిక్ ఒక్క అడుగు దూరంలో నాని!

దీంతో నాని నిర్మాత‌గా డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదు చేయ‌డానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.;

Update: 2025-04-02 07:00 GMT
డ‌బుల్ హ్యాట్రిక్ ఒక్క అడుగు దూరంలో నాని!

నిర్మాత‌గా నేచుర‌ల్ స్టార్ నాని స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాల్ పోస్ట‌ర్ సంస్థ ను స్థాపించినప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కూ ఒక్క ప్లాప్ కూడా చూడ‌లేదు. తొలిసారి `డీఫ‌ర్ దోపీడి` సినిమాకు నాని నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. అటుపై ఐదేళ్ల గ్యాప్ అనంత‌రం వాల్ పోస్ట‌ర్ పై `అ` చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాడు.

కంటెంట్ బేస్డ్ చిత్రానికి మంచి పేరొచ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గా భారీ లాభాలు తీసుకురాలేదని గానీ నిర్మాత‌గా మాత్రం నానికి ఎన‌లేని గుర్తింపును తీసుకొచ్చింది. అదే సినిమాతో ప్ర‌శాంత్ వ‌ర్మ అనే ట్యాలెంట్ కుర్రాడు బ‌య‌ట‌కు రాగ‌లిగాడు. అటుపై `హిట్ ది ఫ‌స్ట్ కేసు` అంటే బ్లాక్ బ‌స్టర్ అందుకు న్నాడు. వాల్ పోస్ట‌ర్ సంస్త‌కు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చి పెట్టింది. దీంతో ఆ ప్రాంచైజీని కొన‌సాగించి ఓ బ్రాండ్ లా మార్చేసాడు.

మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన` హిట్ ది సెకెండ్ కేస్` కూడా మంచి విజ‌యం సాధించడంతో భారీ లాభా లొచ్చాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన కోర్టు కూడా భారీ విజ‌యం సాధించింది. వాల్ పోస్ట‌ర్ సంస్థ‌లో ఇదే భారీ వ‌సూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు కూడా సృష్టించింది. ప్ర‌స్తుతం నాని `హిట్ థ‌ర్డ్ కేసు`లో హీరోగా న‌టిస్తూనే నిర్మాత‌గానూ ప‌ని చేస్తున్నాడు. దీంతో నాని నిర్మాత‌గా డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదు చేయ‌డానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. `హిట్ ది థ‌ర్డ్ కేస్` కూడా విజ‌యం సాధిస్తే నిర్మాత‌గా నాని ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదవుతుంది.

హీరోగా స‌క్సెస్ పుల్ కెరీర్ ని చూస్తోన్న నాని ఖాతాలో ఇదో కొత్త రికార్డు అవుతుంది. మీడియం రేంజ్ హీరోల్లో ఇలాంటి అటెంప్ట్ లు ఎవ‌రూ చేయ‌లేదు. స్టార్ హీరోల్లో కూడా ఇలా స‌క్సెస్ అయింది ఎవ‌రూ లేరు. ఆ ర‌కంగా నేచుర‌ల్ స్టార్ ఈ సినిమాల మ‌ద్య‌లోనే `మీట్ క్యూట్` సిరీస్ ను కూడా నిర్మించాడు. అయితే అది ఓటీటీ రిలీజ్ గానే ప‌రిగ‌ణించాలి.

Tags:    

Similar News