హాయ్ నాన్న.. ఆమె అమ్మ కాదట!
తాజాగా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక చిట్ చాట్ లో నాని మాట్లాడుతూ సినిమాలో శృతి హాసన్ కేవలం పాట వరకే పరిమితం అవుతుందని అన్నాడు.
నాని 'హాయ్ నాన్న' సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడం మరియు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల్లో ట్రైలర్ విడుదల తర్వాత నాన్న పై మరింత ఆసక్తి పెరిగింది అనడంలో సందేహం లేదు.
ఈ సినిమాలో నాని తాను ఏడ్చి ప్రేక్షకులను కూడా ఏడిపించబోతున్నాడు అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత కథ గురించి, అందులో పాత్రల గురించి ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటూ ఉన్నారు. చాలా మంది ఈ సినిమాలో కనిపిస్తున్న పాప నాని, శృతి హాసన్ కి పుట్టిన పాప అయ్యి ఉంటుందని ఊహిస్తున్నారు.
తాజాగా హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక చిట్ చాట్ లో నాని మాట్లాడుతూ సినిమాలో శృతి హాసన్ కేవలం పాట వరకే పరిమితం అవుతుందని అన్నాడు. శృతి హాసన్ పాటలో మాత్రమే కనిపిస్తుందని చెప్పడం తో సినిమాలో ఆమెకి సన్నివేశాలు ఉండే అవకాశం లేదు. కనుక ఆ పాపకి శృతి అమ్మ అయ్యే అవకాశం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి సినిమాలోని శృతి హాసన్ పాత్ర గురించి రకరకాలుగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో నాని చేసిన వ్యాఖ్యలు వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. ఇదే సమయంలో మరి ఆ పాప ఎవరు భయ్యా అనే చర్చ కూడా మొదలై సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తుంది.
ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేస్తుంది అంటూ నాని తన ఊపిరి పై ఒట్టు వేసి మరీ చెప్పాడు. దాన్ని బట్టే ఈ సినిమా పై నానికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన కథ తో ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.