ఇంకా ఎన్ని రోజులు నిఖిల్..?

ముఖ్యంగా కార్తికేయ 2 లాంటి సక్సెస్ అందుకున్న తర్వాత నిఖిల్ ఇలా సైలెంట్ అయిపోవడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.;

Update: 2025-03-14 02:45 GMT

3 ఏళ్ల క్రితం కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్నాడు యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సీక్వెల్ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించింది. దాంతో సినిమా నేషనల్ లెవెల్ లో ఒక రేంజ్ సక్సెస్ అందుకుంది. కార్తికేయ 2 చూసిన నార్త్ ఆడియన్స్ కార్తికేయ 1 ని కూడా చూశారు. ఇక అదే సీక్వెల్ కార్తికేయ 3 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2022 లో కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్, స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు చేశాడు.

కార్తికేయ 2 తర్వాత ఊహించిన స్థాయిలో ఏ సినిమా సక్సెస్ అందుకోలేదు. ఐతే ప్రస్తుతం నిఖిల్ రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఇండియా హౌస్ కాగా మరోటి స్వయంభు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లి చాలా రోజులు అయ్యింది. ఇండియా హౌస్ సినిమాను రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో వస్తుంది. స్వయంభు పీరియాడికల్ మూవీగా రాబోతుంది.

ఈ రెండు సినిమాల గురించి అసలేమాత్రం బజ్ లేదు. ఇండియా హౌస్ సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే గ్లింప్స్ వదిలారు ఆ తర్వాత సినిమా ఎక్కడిదాకా వచ్చింది అన్నది తెలియలేదు. మరోపక్క స్వయంభు సినిమా గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఎంత పాన్ ఇండియా సినిమాలైనా సరే సరైన ప్రమోషన్స్ లేనిదే ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. అలాంటిది నిఖిల్ సినిమాలు సెట్స్ మీద ఉన్నా సరే ఎలాంటి అప్డేట్స్ బయటకు రావట్లేదు.

ముఖ్యంగా కార్తికేయ 2 లాంటి సక్సెస్ అందుకున్న తర్వాత నిఖిల్ ఇలా సైలెంట్ అయిపోవడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. నిఖిల్ కార్తికేయ 2 తో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అలాంటి హీరో సినిమా ఇంత లేట్ గా రావడం ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. మరి నిఖిల్ ఈ సినిమాల గురించి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అన్నది క్లారిటీ లేదు.

నిఖిల్ మాత్రం తన సినిమాలు పూర్తి చేసే దాకా సైలెంట్ గా ఉండి ఆ తర్వాత ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి నిఖిల్ సినిమాల పరిస్థితి ఏంటి అవి ఎక్కడిదాకా వచ్చాయి అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News