ఇక టైగర్ కు ఒక్కటే పోటీ
అయితే భగవంత్ కేసరికి తెలుగు ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఘోస్ట్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన అంతగా స్పందన ఉండకపోవచ్చు.
నందమూరి బాలయ్య భగవంత్ కేసరి మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది. అలాగే దళపతి విజయ్ లియో సినిమా కూడా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. కన్నడం నుంచి పాన్ ఇండియా మూవీగా శివరాజ్ కుమార్ ఘోస్ట్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూడు సినిమాలు వేటికవే ప్రత్యేకం అని చెప్పాలి. వీటిలో ప్రస్తుతానికి అయితే భగవంత్ కేసరి సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
మూవీలో బాలయ్యని ఇది వరకు చూడని రీతిలో అనిల్ రావిపూడి ఆవిష్కరించారంట. ఇంటరెస్టింగ్ ట్విస్ట్ లు, ఎమోషనల్ బ్లాక్స్ తో రొటీన్ కథ అయిన బలంగా చెప్పే ప్రయత్నం చేసాడని తెలుస్తోంది. దీంతో ఆడియన్స్ ఈ మూవీకి భాగా కనెక్ట్ అవుతున్నట్లు టాక్. ఇక ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాకి మిక్సడ్ టాక్ వస్తోంది.
లోకేష్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ చిత్రంలో అనుకున్న స్థాయిలో ఎంగేజ్ చేయడం లేదనే మాట ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది. కథని ఇంకా బలంగా చెప్పగలిగే అవకాశం ఉన్న కూడా లోకేష్ ఎందుకనో చెప్పలేకపోయాడని ట్విట్టర్ టాక్. దీంతో ప్రస్తుతానికి అయితే మిక్సడ్ రెస్పాన్స్ తోనే మూవీ నడుస్తోంది. కన్నడ నుంచి పాన్ ఇండియా మూవీగా వచ్చిన శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది.
అయితే భగవంత్ కేసరికి తెలుగు ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఘోస్ట్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన అంతగా స్పందన ఉండకపోవచ్చు. ఈ పరిస్థితిలో ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి భగవంత్ కేసరి మాత్రమే గట్టి పోటీగా ఉంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం వీకెండ్ లో కచ్చితంగా మంచి వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.
మరి ఈ దసరా రేసులో రవితేజ టైగర్ నాగేశ్వరరావుకి ఎలాంటి రెస్పాన్స్ దొరుకుతుంది అనేది వేచి చూడాలి. లియో సినిమాకి స్పందన తగ్గితే టైగర్ నాగేశ్వరరావుకి థియేటర్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. హిందీ నుంచి టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ రేపు థియేటర్స్ లోకి వస్తోంది. అయితే ఈ సినిమా టైగర్ కి పోటీ ఇచ్చే స్థాయిలో ఉండకపోవచ్చు.