పవర్ స్టార్ ఆట మొదలు పెడుతున్నాడోచ్..!
అంతేకాదు స్వతహాగా పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఓజీ మీద స్పెషల్ కేర్ తో ఉన్నాడు. ఐతే ఓజీ సినిమాకు సంబందించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో పొలిటికల్ లీడర్ గా తన బాధ్యతల్లో మునిగిపోయాడు. రాజకీయాల్లో తనదైన శైలి చూపించాలని ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ మార్క్ చూపిస్తున్నాడు. ఐతే పవన్ పొలిటికల్ జర్నీ సంతృప్తి కరంగా ఉన్నా ఆయన ఎప్పుడు ముఖానికి మేకప్ వేసుకుని రీల్ యాక్షన్ కి రెడీ అవుతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.
పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో హరి హర వీరమల్లు సినిమా మొదలై నాలుగేళ్లు దాటేసింది. క్రిష్ వదిలేసిన ఆ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఐతే మరోపక్క సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ ఈ కాంబోలో వస్తున్న నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సినిమాగా ఓజీ వస్తుంది. ఈ సినిమా నుంచి జస్ట్ గ్లింప్స్ తోనే అదరగొట్టేలా చేశాడు సుజిత్. సాహో తర్వాత చాలా టైం తీసుకున్నా తీస్తే ఓజీ లాంటి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు సుజిత్.
అంతేకాదు స్వతహాగా పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఓజీ మీద స్పెషల్ కేర్ తో ఉన్నాడు. ఐతే ఓజీ సినిమాకు సంబందించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. సినిమా నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకాక్ లో ఫిక్స్ చేశారట. ఆ విషయాన్నే అనౌన్స్ చేస్తూ రియల్ హీట్ ఇన్ బ్యాంకాక్ అని మేకర్స్ ప్రకటించారు. అందుతున్న సమాచారాన్ని బట్టి బ్యాంకాక్ లో ఓజీ యాక్షన్ ఘట్టాలు షూట్ చేయబోతున్నారు. ఈ సీన్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో సుజిత్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం ఈసారి లాంగ్ షెడ్యూల్ తో సినిమా మాక్సిమం పూర్తి చేయాలని ఓజీ టీం చూస్తుంది.
ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాను మార్చిలో రిలీజ్ లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే మాత్రం ఓజీ ని కూడా సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఓజీ సినిమా సుజిత్ మార్క్ యాక్షన్ సీన్స్ తో దుమ్ము దులిపేస్తాడని అంటున్నారు. సాహో సినిమాలో సుజిత్ యాక్షన్ సీన్స్ కు స్పెషల్ అప్లాజ్ వచ్చాయి. ఈ సినిమాలో దానికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఓజీ టీజర్ తోనే పాన్ ఇండియా లెవెల్ లో బజ్ క్రియేట్ చేసిన సుజిత్ సినిమాను కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ ఫిదా అయ్యేలా చూస్తున్నాడట. మరి సినిమా రేంజ్ ఏంటన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.