పవన్ మరింత దృఢంగా.. అందుకే ఇలా..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో అధికారిక కార్యకలాపాలలో చాలా బిజీగా ఉన్నారు.

Update: 2024-06-27 04:39 GMT

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో అధికారిక కార్యకలాపాలలో చాలా బిజీగా ఉన్నారు. వరుసగా సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో కేంద్రం నిధుల విడుదలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. శాఖలలో జరిగిన అవకతవకలపై ఫోకస్ చేస్తున్నారు. వీటిలో పూర్తిగా నిమగ్నమైన పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజానాయకుడిగా అందరికి కనిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హిందూ సాంప్రదాయ ఆచారాలు చాలా నిష్ఠతో పాటిస్తారనే సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకున్నారు. 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షలో ఉంటారు. ఈ దీక్ష సమయంలో పవన్ కళ్యాణ్ కేవలం పండ్లు, ద్రవ పదార్ధాలు మాత్రమే తీసుకుంటారు. నేలపైన నిద్రపోతారు.

చాలా నిష్ఠతో ఈ దీక్షని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే ఇంత కఠినమైన దీక్షని పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయని జనసైనికుల నుంచి వినిపిస్తోన్న మాట. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు విస్తృత రాజకీయ ప్రచారం చేశారు. దీనికోసం ఒక వెహికల్ ఉపయోగించారు. ఆ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. ప్రచారాన్ని కూడా వారాహి యాత్ర అని పేరుతో చేశారు.

ఈ యాత్ర సక్సెస్ అయ్యింది. కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించారు. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకున్నారు. వారాహి మాత ఆశీర్వాదం వలన ఈ విజయం సాధ్యం అయ్యిందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు.

అలాగే డిప్యూటీ సీఎంగా పరిపాలన బాధ్యతలలో ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని దీక్ష తీసుకున్నారంట. వారాహి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శత్రు భయం ఉండదని లైఫ్ లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి వారాహి అమ్మవారిని పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ దీక్ష కారణంగా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

విజయం వచ్చిన తరువాత బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే పవన్ మానసికంగా మరింత దృఢంగా ఉండేందుకు కూడా ఈ దీక్షలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో షూటింగ్స్ లతో కూడా పవన్ బిజీ కానున్నాడు. కాబట్టి ముందే దీక్ష నియమాన్ని సంపూర్ణ పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

Tags:    

Similar News