బాలయ్య తర్వాత వెంకటేష్ కోసమే ఇలా!
ఆ తర్వాత మళ్లీ నటసింహ బాలకృష్ణ నటించిన సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశం కనిపిస్తుంటుంది.
పాత కాలం రోజుల్లో ప్రేక్షకులు సినిమాలకు ఎండ్ల బండ్లలోనూ..ట్రాక్టర్లపై తరలి వచ్చి చూసేవారు. అప్పట్లో ట్రావెలింగ్ సదుపాయం లేని రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు ప్రతీ స్టార్ హీరో సినిమాకు చోటు చేసుకునేవి. అయితే కాల క్రమంలో వాహనాలు పెరగడంతో ఆ కల్చర్ కనుమరుగైపోయింది. ఆ తర్వాత మళ్లీ నటసింహ బాలకృష్ణ నటించిన సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశం కనిపిస్తుంటుంది.
బాలయ్య కథానాయకుడిగా నటించిన `అఖండ` సినిమా రిలీజ్ అయిన సమయంలో ఏపీలో కొన్ని చోట్ల ట్రాక్టర్లపై ప్రేక్షకులు సినిమాకొచ్చారు. ఐదేళ్ల క్రితం `అఖండ` రిలీజ్ అయినప్పుడు తూర్పు గోదావరి జిల్లా తుని శ్రీరామ థియేటర్ వద్ద ఇదే సన్నివేశం కనిపించింది. ఓ పది ట్రాక్టర్లపై సినిమా కోసం బండెనక బండి కట్టి జనాలంతా టికెట్ల కోసం ఎగపడ్డారు. ఆ తర్వాత `భగవంత్ కేసరి` రిలీజ్ అయిన సమయంలోనూ ఇలాంటి సన్నివేశం రాష్ట్రంలో పలు చోట్ల చోటు చేసుకుంది.
కానీ ఆ తర్వాత ఏ హీరో సినిమాకు ఇలా ట్రాక్టర్లు వేసుకుని జనాలతో తరలి రాలేదు. అయితే తాజాగా సంక్రాంతి కి రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా కోసం మాత్రం అలాంటి సన్నివేశం నిన్నటి రోజున కనిపిచింది. కాకినాడ జిల్లా తునిలోని శ్రీరామ థియేటర్ వద్ద చుట్టు పక్కల గ్రామాల వాసులు ట్రాక్టర్ పై సినిమా కొచ్చారు. ట్రాక్టర్ రోడ్డపై నిలిపివేసి కౌంటర్ వద్ద టికెట్లు కొనడానికి వెళ్లినా లాభం లేకపోయింది. ఎందుకంటే అప్పటికే హౌస్ ఫుల్ అయింది.
దీంతో వచ్చిన ట్రాక్టర్ వెనుదిరిగింది. వెంకటేష్ సినిమా చూడాలని ఎంతో ఆశతో వచ్చినా నిరాశే ఎదురైందని వాపోయారు. అలాగే టికెట్ ధరల అంశం కూడా ఆ గ్రామ వాసుల్లో చర్చకొచ్చింది. సినిమా టికెట్ ధర అతిగా ఉందని...అంత ధరలతో తమ లాంటి ప్రజలు సినిమాకు రాలేరని...వీలైనంత త్వరగా ధరలు తగ్గించాలని కోరారు. ఈ నేపథ్యంలో బాలయ్య తర్వాత వెంకటేష్ కోసం ట్రాక్టర్ పై జనాలు తరలి వచ్చారని స్థానిక ప్రజలు మాట్లాడు కోవడం చర్చనీయాంశంగా మారింది.