బిగ్ బాస్ ఫైనల్ కు భారీ భద్రత!
గత ఏడాది సీజన్ 7 విషయంలో అన్నపూర్ణ స్టూడియో స్ వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే.
'బిగ్ బాస్ సీజన్ 8' తుది దశకు చేరుకుంది. ఈనెల 15న ఫైనల్స్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ కు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావు లేకుండా పటిష్ట బందో బస్తు ఏర్పాటుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. గత ఏడాది సీజన్ 7 విషయంలో అన్నపూర్ణ స్టూడియో స్ వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే.
గోడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం వంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ అభిమానులు ప్రాంగణం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు. దీంతో భద్రత అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ సైతం చేసారు. ఈసారి అలాంటి సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలకు ఇప్పటి నుంచే శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు కు పోలీస్ లు రెడీ అవుతున్నారు.
అయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియోస్, బిగ్ బాస్ యాజమాన్యానికి అందజేసారు. గత ఏడాది అల్లర్లు చోటు చేసుకున్న సమయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కొంత మంది మూకలు తప్పించుకున్నారు. కానీ ఈసారి ఆఛాన్స లేకుండా ఆకతాయిలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. దీనికి సంబంధించి గత ఏడాది అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యంపై కూడా పోలీస్ కేసు నమోదైంది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న కెమెరాలను ఈనెల 14 లోగా ఏర్పాటు చేస్తారు.
అలాగే ఫైనల్స్ రోజున పోలీసు బందోబస్తు కూడా ముందుగానే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సీసీల ద్వారా దొంగతనాలకు పాల్పడిన వారిని సులభంగా గుర్తించవచ్చు. ఇటీవలే 'పుష్ప2 'ఈవెంట్ కోసం యూసఫ్ గూడలో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఆ రోజు ఈవెంట్లో 15ఫోన్లు.. రెండు బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయి. దొంగల్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ లు పరిశీలిస్తున్నారు.