కాంఛన : పూజా హెగ్డేతో పెద్ద రిస్క్
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా కాంచన సిరీస్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకుడిగా కాంచన సిరీస్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు కాంచన సిరీస్‌లో మూడు పార్ట్‌లు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు లారెన్స్ ప్రస్తుతం కాంచన ప్రాంచైజీలో నాలుగో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఎప్పటిలాగే రాఘవ లారెన్స్ హీరోగా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. కాంచన 4లో పూజా హెగ్డే కన్ఫర్మ్ అయిన వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. కానీ తాజాగా సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఆసక్తికర పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పూజా హెగ్డే అనగానే గ్లామర్ పాత్రలు గుర్తుకు వస్తాయి. కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు సినిమాల్లో మినహా అన్ని సినిమాల్లోనూ ఫుల్ గ్లామర్ రోల్స్ చేసింది. ముఖ్యంగా ఈమె డీజే, అల వైకుంఠపురంలో ఇంకా చాలా సినిమాల్లో పూజా హెగ్డే గ్లామర్ షోతో అలరించింది. అందుకే పూజా హెగ్డేను ఎక్కువగా స్కిన్ షో పాత్రల్లోనే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఆమెను కెరీర్ ఆరంభం నుంచి కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో చూడలేదు, ఒకవేళ అలాంటి పాత్రల్లో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. స్కిన్ షో పై ఆధార పడ్డ కారణంగానే పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది.
టాలీవుడ్‌లో ఈ అమ్మడు సినిమాలకు కమిట్ అయి చాలా కాలం అయింది. ఆ మధ్య బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'కాంచన 4' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో చెవిటి - మూగ అమ్మాయి పాత్రలో పూజా హెగ్డేను రాఘవ లారెన్స్ చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. తన గత చిత్రాల్లో హీరోయిన్‌ను గ్లామర్‌గానే చూపించిన లారెన్స్ కాంచన 3 లో నిత్యా మీనన్‌ను డీ గ్లామర్‌గా చూపించాడు. ఇప్పుడు కాంచన 4 లోనూ హీరోయిన్ పూజా హెగ్డేను డీ గ్లామర్‌గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
పూజా హెగ్డే వంటి గ్లామర్ హీరోయిన్‌ను డీ గ్లామర్ పాత్రలో చూపించడం అనేది కచ్చితంగా పెద్ద సాహసం అని చెప్పాలి. అది కాకుండా చెవిటి మూగ అమ్మాయిగా పూజా హెగ్డేను చూపించాలి అనుకోవడం ద్వారా లారెన్స్ చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు అనే అభిప్రాయంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాత్రలకు ప్రత్యేకంగా కొందరు హీరోయిన్స్ ఉన్నారని, వారిని కాకుండా ఇలా పూజా హెగ్డేను తీసుకోవడం వల్ల సినిమాను రిస్క్‌లో పెట్టినట్లు అవుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. లారెన్స్ పెట్టుకున్న నమ్మకంను పూజా హెగ్డే ఎంత వరకు నెరవేరుస్తుందో చూడాలి.