పూజా.. ఇది నిజమా?
సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ కోసం పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొన్న అందాల భామ పూజా హెగ్డే. ఈ అమ్మడు చివరిగా తెలుగులో రాధేశ్యామ్ మూవీలో నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడీగా చేసిన మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ అయితే లేవు. సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న మూవీ కోసం పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ ఏడాది రెండు సినిమాలలో పూజా హెగ్డే ఛాన్స్ లు కోల్పోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ముందు పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీలతో రిప్లేస్ చేయడం జరిగిందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా పూజాని తప్పించారు. అయితే ఆమె రెమ్యునరేషన్ కూడా ఈ సినిమాల నుంచి తొలగించడానికి ఒక కారణం అనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. టైర్ 2 హీరోలతో సినిమాలు చేస్తోన్న దర్శక నిర్మాతలు పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారంట.
అయితే ఆమె రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా తనతో వచ్చే వారి కోసం ఎక్స్ ట్రా మరో కోటి రూపాయిల వరకు నిర్మాతలకి ఖర్చు చూపిస్తోందనే ప్రచారం నడుస్తోంది. ఆమె చెప్పే లెక్కలకి భయపడి తనని హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నాలు విరమించుకుంటున్నారంట. ఆమె స్థానంలో ప్రస్తుతం రేసింగ్ లో ఉన్న శ్రీలీల, మృణాల్ ఠాకూర్ ని తీసుకోవడం బెటర్ అని అనుకుంటున్నట్లు టాక్.
అలాగే నేహాశెట్టి, అనుపమ పరమేశ్వరన్ లాంటి నటీమణులు కూడా స్టార్ యాక్టర్స్ గా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. పూజా హెగ్డే చెబుతోన్న రెమ్యునరేషన్ లెక్కలకి భయపడి నిర్మాతలు ఎవరూ ఆమెని అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే పూజాహెగ్డే టీమ్ రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.