ప్రభాస్- హను.. గుడ్ న్యూస్ ఏమిటంటే..

కొత్త అందం ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Update: 2025-02-19 15:04 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. కొత్త అందం ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా ఆ విషయాన్ని మేకర్స్ తెలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. సినిమా విభిన్నమైన కథతో రూపొందుతోంది. పూజా కార్యక్రమాల సమయంలో మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లాప్‌ బోర్డుపై మూడు ఆసక్తికర విషయాలను మేకర్స్ పొందుపరచగా.. అందరినీ అవి ఆకట్టుకున్నాయి.

కలకత్తా హోవ్డా బ్రిడ్జ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పతాకం, హైదరాబాద్‌ చార్మినార్‌ ను క్లాప్ బోర్డ్ పై చూపించారు మేకర్స్. 1940 స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతున్నట్లు తెలిపారు. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా సాగనున్న మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు.

అయితే ప్రభాస్ తో తాను చేస్తున్న మూవీ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకు వెళ్తుందని హను రీసెంట్ గా చెప్పి అంచనాలు పెంచేశారు. సీతారామం తర్వాత దీనిని రాయడానికి సుమారు ఏడాదికి పైగా సమయం పట్టిందని తెలిపారు. ఆడియన్స్ తప్పక సర్ప్రైజ్ గా ఫీలవుతారని చెప్పారు. ఇప్పుడు ఆయన క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు!

అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు జరగాల్సిన ఫోటో షూట్ ను ఇప్పటికే హను పూర్తి చేశారని వినికిడి. ప్రస్తుతం డిజైన్ వర్క్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే అఫీషియల్ డేట్ ను ప్రకటించి.. ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారట.

దీంతో ఇప్పుడు ఆ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వెయిటింగ్ ఫర్ అప్డేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. వరుస అప్డేట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మేకర్స్ కూడా ఆడియన్స్ లో వేరే లెవెల్ బజ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి మేకర్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో..

Tags:    

Similar News