ఫౌజీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో తన కెరీర్లోనే మొదటిసారి హార్రర్ కామెడీ జానర్ ను ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి చేయకుండానే ప్రభాస్ సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాను మొదలుపెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
1940 నాటి యుద్ధ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో ఇన్ స్టా స్టార్ ఇమాన్వీ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన 30 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది. ఫౌజీ కీలక భాగం షూటింగ్ కారైకుడి, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగనుంది.
తర్వాతి షెడ్యూల్ రేపటి(ఫిబ్రవరి 5) నుంచి హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ను ఎలాంటి బ్రేకుల్లేకుండా డైరెక్టర్ హను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఫిబ్రవరిలో మొదలుపెడితో మార్చి ఎండింగ్ వరకు ఈ షెడ్యూల్ షూటింగ్ నిరంతరాయగా కొనసాగుతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ప్రభాస్ కు గాయం అవడంతో ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యమైంది.
ఆ గ్యాప్ ను కవర్ చేయడానికే హను ఈ షెడ్యూల్ ను ఎలాంటి బ్రేకులు లేకుండా ప్లాన్ చేశాడని అంటున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాపై అందరికీ చాలా అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే రాజా సాబ్, ఫౌజీ సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ తన తర్వాతి సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటున్న స్పిరిట్ షూటింగ్ ఈ ఏడాది మే నుంచి మొదలయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 2026లో స్పిరిట్ ను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. స్పిరిట్ లో ప్రభాస్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించనున్నట్టు సమాచారం.