మారుతి ఇక మొదలుపెట్టాల్సిందే!
తన క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చే హీరో దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమే.
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ఏం ఆలోచించకుండా ఫ్యాన్స్ ఎగబడి థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలాంటి పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం అంటే అది బంపరాఫర్ అనే చెప్పాలి. తన క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చే హీరో దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమే.
ఇప్పటి వరకు ఆయనతో పని చేస్తున్న డైరెక్టర్లు అందరూ ప్రభాస్ క్రేజ్ ను వాడుకుంటూనే వచ్చారు. కానీ ఈ ట్రిక్ ను ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమా చేస్తున్న మారుతి మాత్రం మిస్ అయినట్టు అనిపిస్తుంది. రాజా సాబ్ సినిమా మొదలై ఇప్పటికే చాలా కాలమైనప్పటికీ ఆ సినిమా గురించి నెట్టింట పెద్దగా వార్తలు వినిపించడం లేదు.
మరోవైపు ప్రభాస్ హీరోగా రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ గురించి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ఫౌజీ సినిమాల గురించి మాత్రం ఏదొక కారణంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే మారుతిని తక్కువ అంచనా వేయడానికి లేదు. సినిమా రెడీ అయిన తర్వాత ఆడియన్స్ కు థియేటర్‌కు ఎలా రప్పించాలనేది ఆయనకు చాలా బాగా తెలుసు.
ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో మారుతి మంచి దిట్టనే. రూరల్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి, సినిమాకు లాస్ట్ మినిట్ లో హైప్ పెంచడంలో మారుతి నిపుణుడు. కానీ ప్రభాస్ లైనప్ చూసుకుంటే ఫౌజీ, స్పిరిట్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి టైమ్ లో మారుతి ట్రాక్ లోకి వచ్చి రాజా సాబ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదొక రకంగా రాజా సాబ్ వార్తల్లో నిలిస్తే తప్ప మారుతిని నెటిజన్లు ఊరుకునేలా లేరు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనేది మాత్రం మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.