విలన్ కోసం త్రిముఖ పోరు!
ప్రభాస్ షూటింగ్ తో బిజీగా ఉండటంతో? కూల్ గా కనిపించాడు. స్టార్ స్టేటస్ ని ఆస్వాదించే ప్రక్రియలో భాగంగా సినిమా ఈవెంట్లకు హాజరవ్వడంతో ఎక్కువగా సమయం గడిపాడు.;

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన పనులు సందీప్ వంగా ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. `పౌజీ` షూటింగ్ శర వేగంగా జరగుతుండటంతో సందీప్ వంగా అలెర్ట్ అయ్యాడు. డార్లింగ్ ఎప్పుడైనా డేట్లు ఇచ్చే అవకాశం ఉండటంతో సందీప్ సర్వం సిద్దం చేసి పెడుతున్నారు. కొన్ని రోజులుగా 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. 'యానిమల్' రిలీజ్ తర్వాత సందీప్ పూర్తిగా రిలాక్స్ అయిపోయాడు.
ప్రభాస్ షూటింగ్ తో బిజీగా ఉండటంతో? కూల్ గా కనిపించాడు. స్టార్ స్టేటస్ ని ఆస్వాదించే ప్రక్రియలో భాగంగా సినిమా ఈవెంట్లకు హాజరవ్వడంతో ఎక్కువగా సమయం గడిపాడు. కానీ ఇక ఆ సమయం అయిపోయింది. మళ్లీ కెప్టెన్ గా కుర్చీ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిలో భాగంగా 'స్పిరిట్' పనులు రీ స్టార్ట్ చేసాడు. ఇందులో హీరోయిన్ ఎంపికపై సీరియస్ గా కసరత్తులు చేస్తున్నాడు.
అలాగే ప్రభాస్ ని ఢీకొట్టే విలన్ పాత్ర ఎవరు? పోషించాలి అన్న దానిపై అంతే సీరియస్ గానూ ఉన్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ , కొరియన్ నటుడు డాంగ్లీ , విజయ్ సేతుపతి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గరి మధ్య త్రిముఖ పోరు మొదలైంది. ఎవర్ని ఎంపిక చేయాలో? అర్దం కాని పరిస్థితుల్లో సందీప్ ఉన్నట్లు సమాచారం. ముగ్గురులో ఏ ఒక్కరు తీసేయాల్సిన నటులు కాదు.
డాంగ్లీ ని పక్కన బెడితే? మిగతా ఇద్దరు భారతీయ నటులే. నటులుగా దేశం మొత్తం ఫేమస్ అయిన వారు. దీంతో ఇద్దరి మధ్యా నువ్వా? నేనా? పోరు గట్టిగా సాగుతుందని సమాచారం. సందీప్ సినిమాలో భాగం అవ్వాలని వాళ్లు కూడా సీరియస్ గానే ఉన్నట్లు వినిపిస్తుంది. మరి ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.