ప్రగ్యా జైస్వాల్.. ట్రెడిషినల్ డ్రెస్సులో స్టన్నింగ్ గ్లామర్ డోస్

పెళ్లి వేడుకలో తళుక్కుమన్న ప్రగ్యా అందమైన పింక్ శారీ లో మెరిసిపోతోంది. ఈ స్పెషల్ ఫోటోషూట్‌లో ఆమె సంప్రదాయ లుక్ కు గ్లామర్ టచ్‌ను మిక్స్ చేసింది.;

Update: 2025-03-12 05:09 GMT

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలో తళుక్కుమన్న ప్రగ్యా అందమైన పింక్ శారీ లో మెరిసిపోతోంది. ఈ స్పెషల్ ఫోటోషూట్‌లో ఆమె సంప్రదాయ లుక్ కు గ్లామర్ టచ్‌ను మిక్స్ చేసింది. కాస్త వెస్ట్రన్ టచ్ ఉన్న స్టైలిష్ లుక్ తో ఆమె నవ్వుతూ ఫోజులిస్తూ అభిమానులకు కనువిందు అందించింది.


ఈ లుక్స్ లో ప్రగ్యా మెరిసిన విధానం చూసిన నెటిజన్లు ఆమె స్టైల్ సెన్స్ గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోల్లో ఆమె వేసుకున్న పింక్ శారీ డిజైనర్ కలెక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రమంగా ఆమె ఫ్యాషన్ అభిరుచి మరింతగా మెరుగు పడుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాచింగ్ జ్యువెలరీ తో ప్రగ్యా అందానికి అదనపు మెరుపు వచ్చింది. స్టైలింగ్ డిజైనర్ మనోగ్ఞ గోల్లపూడి ఈ లుక్ ను డిజైన్ చేయడం విశేషం.


ఆభరణాల ఎంపిక కూడా ఆమె లుక్ కి మరింత అందాన్ని తెచ్చింది. ఆమె మేకప్ స్టన్నింగ్ గా ఉండటంతో పాటు, ఆమె కురులు తళుక్కుమన్న తీరు అభిమానులను కట్టిపడేస్తోంది. ఈ ఫోటోల గురించి ప్రగ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. “ప్రేమతో నిండిన రోజులు, మాయతో నిండిన రాత్రులు..” అంటూ ఆమె ఈ వేడుకలో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంది.


బహ్రైన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుక సందర్భంగా ఈ ఫోటోలు తీయించుకున్నట్టు ఆమె క్యాప్షన్ ద్వారా వెల్లడించింది. ఫ్రెండ్ వెడ్డింగ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ అక్కడ తన లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుక తాలూకు ఫోటోలు ఆమె ఇన్‌స్టాలో షేర్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. “గ్లామర్ క్వీన్” అంటూ అనేక మంది ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రగ్యా ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. టాలీవుడ్ లో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తోంది.


Tags:    

Similar News