సినిమాలు వదిలేస్తున్నా.. ప్రేమమ్ దర్శకుడి ఆవేదన!
నాకు సినిమా నుంచి తప్పుకోవడం ఇష్టం లేదు.. కానీ వేరే ఆప్షన్ లేదు. నేను నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు.
మలయాళ క్లాసిక్స్‌లో 'ప్రేమమ్' ఒకటి. ఈ చిత్రం కమర్షియల్‌గాను బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత తెలుగులోను ప్రేమమ్ పేరుతోనే రీమేక్ అయి ఘనవిజయం సాధించింది. నాగచైతన్య ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ప్రేమమ్ దర్శకుడు ఆల్ఫోన్స్ కి అప్పటికే మంచి పేరొచ్చింది.
ఆల్ఫోన్స్ పుత్రేన్ 2015లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత అతడు సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. కానీ ఆ పోస్ట్ ని ఆ తర్వాత తొలగించాడు. ఆల్ఫోన్స్ పుత్రన్ తన ఇన్‌స్టాలో ఇలా రాసారు. ''నేను నా సినీ కెరీర్‌ను ఆపివేస్తున్నాను. నేను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ని కలిగి ఉన్నాను. ఇది నిన్న నేను స్వయంగా కనుగొన్నాను. మరెవరికీ భారం కాకూడదనుకుంటున్నాను'' అని ఆవేదనగా రాసాడు.
నాకు సినిమా నుంచి తప్పుకోవడం ఇష్టం లేదు.. కానీ వేరే ఆప్షన్ లేదు. నేను నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఆరోగ్యం బలహీనత జీవితంలో అనూహ్యంగా ఇంటర్వెల్ పంచ్ వంటి ట్విస్ట్‌ను తెస్తుంది... అని రాసాడు. నేను ఓటీటీకి పరిమితమవుతాను. పాటలు, చిన్న వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తాను అని తెలిపాడు. అయితే ఈ పోస్ట్ ని సోషల్ మీడియాల నుంచి అతడు తొలగించడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే అతడు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గోల్డ్ తీవ్రంగా నిరాశపరచడంతోనే అతడు ఇలా కలతకు గురయ్యాడని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. నయనతార, పృథ్వీరాజ్ సుకుమార్‌లతో అల్ఫోన్స్ పుత్రన్ తెరకెక్కించిన 'గోల్డ్' ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తర్వాత నటీనటులు శాండీ - సహానా సర్వేష్లతో కలిసి 'గిఫ్ట్' చిత్రాన్ని ప్రకటించాడు. ఆల్ఫోన్స్ గతంలో మలయాళ చిత్రం 'నేరమ్'కి దర్శకత్వం వహించారు. తదుపరి అతడి ప్రయాణం ఎలా సాగనుందో వేచి చూడాలి.