క్రిస్మస్ వరకు పుష్ప 2 ఉంటుందా..?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు సొంతం చేస్తూ దూసుకు పోతుంది. ఇప్పటి వరకు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయాలి అంటే మరో రూ.450 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది. అంత భారీ మొత్తంలో సినిమా వసూళ్లు రాబట్టాలి అంటే క్రిస్మస్ సీజన్ వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటి వరకు సినిమా థియేటర్‌లో కొంత మేరకు అయినా నిలిస్తే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
క్రిస్మస్ కానుకగా తెలుగుతో పాటు దాదాపు అన్ని భాషల్లోనూ చిన్నా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా మలయాళంలో పుష్ప 2 సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే అక్కడ మరింతగా వసూళ్లు రాబట్టాలి అంటే మాత్రం క్రిస్మస్ వరకు వెయిట్ చేయాలి. కానీ మలయాళ సినిమాలు రెండు మూడు క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు వస్తే కచ్చితంగా పుష్ప 2 ను జనాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా జనాలు మాత్రం సినిమాను చూస్తారని, వసూళ్లు వస్తాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్ క్రిస్మస్‌పై నమ్మకం పెట్టుకుని ఉన్నాడు.
తెలుగులో ఇప్పటికే పుష్ప 2 సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం నార్త్ నుంచి అధికంగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. రెండో సోమవారం సైతం ఏకంగా రూ.25 కోట్ల వసూళ్లను పుష్ప 2 రాబట్టింది. రెండో వీకెండ్‌లో వంద కోట్లు అంతకు మించి వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఆ లెక్కన పుష్ప 2 సినిమా మూడో వీకెండ్‌లోనూ నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త వెయిట్ చేస్తూ క్రిస్మస్ వరకు అక్కడ మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్నలు నటించిన పుష్ప 2 సినిమాలోని పలు సన్నివేశాలు, ముఖ్యంగా జాతర సన్నివేశంను నార్త్ ఇండియా ప్రేక్షకులు తెగ ఆధరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కంటే పుష్ప 2 ను హిందీ ప్రేక్షకులు అభిమానించడం ఆశ్చర్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వసూళ్లతో పోల్చితే నార్త్ ఇండియా వసూళ్లు దాదాపుగా డబుల్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా రెండో వారంలో భారీ వసూళ్లు సాధించడం అనేది జరగడం లేదు. కానీ పుష్ప 2 సినిమా విషయంలో అది జరుగుతుంది. కనుక కచ్చితంగా ముందు ముందు క్రిస్మస్ వరకు నార్త్ ఇండియాలో పుష్ప 2 ఉండే అవకాశం ఉంది, అక్కడ మరో వంద కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలూ ఉన్నాయి.