పుష్ప 2 బాక్సాఫీస్.. నెక్స్ట్ ఎంత?

ఇదిలా ఉంటే ఈ మూవీ లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2024-12-20 04:46 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ వరల్డ్ వైడ్ గా 1500 కోట్ల మార్క్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా జోరు కొంత వరకు తగ్గిన కూడా హిందీలో దూసుకుపోతోంది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ వసూళ్లు అందుకుంటూ ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హిందీలో 600 కోట్లు క్రాస్ చేసిన ‘పుష్ప 2’ మ్యాగ్జిమమ్ 700-800 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో వసూళ్లు చేస్తుందని బిటౌన్ లో వినిపిస్తోంది. నార్త్ అమెరికాలో కూడా 15 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కి దగ్గరగా ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఇదే స్పీడ్ లో ‘దంగల్’ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 2000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందా అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

అయితే అదంతా ఈజీ కాదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలా అని మరీ కష్టతరం కూడా కాదని చెబుతున్నారు. మూడో వారం కూడా ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తే మాత్రం క్రిస్మస్ హాలిడేస్ నేపథ్యంలో 2000 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడానికి ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ మూవీ కలెక్షన్స్ మరల పుంజుకోవాలంటే రిపీటెడ్ ఆడియన్స్ థియేటర్స్ కి రావాలి. టికెట్ ధరలు తగ్గిన నేపథ్యంలో మేకర్స్ ఏమైనా టికెట్స్ పై స్పెషల్ ఆఫర్స్ పెడితే ప్రేక్షకులు సినిమా చూడటానికి వెళ్లొచ్చని అనుకుంటున్నారు.

నిజానికి మూవీ సక్సెస్ టూర్ ప్లాన్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయంలో వెనక్కి తగ్గారు. అల్లు అర్జున్ కూడా మీడియా ముందుకొచ్చి ‘పుష్ప 2’ మూవీ సక్సెస్ గురించి మాట్లాడలని అనుకున్నారు. కానీ పరిస్థితులు భిన్నంగా ఉండడంతో వెనక్కి తగ్గారు.. మేగ్జిమమ్ ఈ సినిమా లాంగ్ రన్ లో 1600 కోట్ల లోపు కలెక్షన్స్ తోనే క్లోజ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సినిమా ఇచ్చిన ఊపు అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి కచ్చితంగా హెల్ప్ అవుతుంది. వాటిలో మాత్రం 2000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప 2’ మూవీ ఎలాంటి రివ్యూలు వచ్చిన కూడా అంచనాలకి మించి కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది టాలీవుడ్ కి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ఫుల్ ఎండింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News