ఖిలాడి డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్.. టాలెంటెడ్ హీరో 25వ సినిమా

అలాగే లారెన్స్ కు హీరోగా ఇది 25వ చిత్రం కాబడం విశేషం.

Update: 2024-09-14 17:40 GMT

ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ, టాలెంటెడ్ దర్శకుడు రమేష్ వర్మతో మరోసారి కలిసి ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇక హీరో ఎవరు అనే విషయంలో చాలా రోజులుగా పలు రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ గా నేడు అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు. రాఘవ లారెన్స్ హీరోగా ఈ సినిమా రానుంది. అలాగే లారెన్స్ కు హీరోగా ఇది 25వ చిత్రం కాబడం విశేషం.


రాక్షసుడు మరియు ఖిలాడి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత, కోనేరు సత్యనారాయణ మరియు రమేష్ వర్మ కలయికలో ఇది మూడో చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, నీలాద్రి ప్రొడక్షన్స్, హావ్విష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "బిగ్ యాక్షన్ అడ్వెంచర్ బిగిన్స్" అనే శీర్షికతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించగా, విడుదలైన పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను సృష్టించింది.

రాఘవ లారెన్స్ పోస్టర్ లో కనిపిస్తున్న శాడో అవతార్, సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. రాఘవ లారెన్స్ ఇటీవల వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. దాంతో, ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లారెన్స్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా, ఆయన కెరీర్ కి మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం లారెన్స్ పాన్-ఇండియా లెవెల్లో విశేష గుర్తింపు తెచ్చుకోవడం, ఈ ప్రాజెక్ట్ ని మరింత ప్రతిష్టాత్మకంగా మార్చింది. కోనేరు సత్యనారాయణ తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూడో ప్రాజెక్ట్, ఇప్పటి వరకు చేసిన చిత్రాల కన్నా పెద్దది, యాక్షన్ మరియు అడ్వెంచర్ అంశాలతో పూర్తిగా భిన్నంగా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ 2024 నవంబర్ లో ప్రారంభం కానుండగా, 2025 సమ్మర్ లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు, నటీనటుల జాబితా మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రాఘవ లారెన్స్ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నారని అందరూ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News