రెహమాన్ మేనల్లుడు.. స్ట్రోక్ మీద స్ట్రోక్

ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అనే ఇమేజ్ తో ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన జీవీ ప్రకాశ్ కుమార్ అనతి కాలంలోనే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు.

Update: 2023-11-24 04:35 GMT

తమిళ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును జీవీ ప్రకాష్ కుమార్ సొంతం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అనే ఇమేజ్ తో ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన జీవీ ప్రకాశ్ కుమార్ అనతి కాలంలోనే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. రెహమాన్ ఛాయలు తనమీద పడకుండా తనకంటూ ప్రత్యేకమైన స్థానం కోలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూనే జీవి ప్రకాష్ కుమార్ హీరోగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు. డార్లింగ్ అనే సినిమాతో 2015లో జీవి ప్రకాష్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు. తర్వాత వరుస సక్సెస్ లో అందుకున్నాడు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే హీరోగా చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు.

వాటిలో రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఒకటి ప్రీ ప్రొడక్షన్ లో ఉండగా ఇంకో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. హీరోగా ఇమేజ్ పెరగడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ వరుస ఫెయిల్యూర్ లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. అయితే ఆ సినిమా సాంగ్స్ ఒక్కటి కూడా జనాలకు రీచ్ కాలేదు.

అలాగే కార్తీ హీరోగా తెరకెక్కిన జపాన్ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఆదికేశవ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఒకటి కూడా మెప్పించలేదు. ఈ రోజుల్లో సినిమాలకు మ్యూజిక్ ద్వారానే క్రేజ్ వస్తోంది. అయితే జీవి మాత్రం తన మ్యూజిక్ తో హైప్ క్రియేట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారు.

యాక్టర్ గా బిజీ అయినప్పటి నుంచి తన నుంచి ఆశించిన స్థాయిలో మ్యూజిక్ రావడం లేదనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే తన మెయిన్ స్ట్రీమ్ అయిన మ్యూజిక్ కి ఫుల్ స్టాప్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా గ్రహించి ఎంతవరకు మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్లీ తనని తాను ప్రూవ్ చేసుకుంటానేది వేచి చూడాలి.

Tags:    

Similar News