తారక్ పై రాజీవ్ కనకాల సీరియస్!
తాజాగా ఈ విషయాన్ని రాజీవ్ కనకాల రివీల్ చేసాడు. ఇద్దరి మధ్య పరిచయం 'స్టూడెంట్ నెంబర్ వన్' షూటింగ్ సమయంలో జరిగింది.;

యంగ్ టైగర్ ఎన్టీఆర్-నటుడు రాజీవ్ కనకాల మంచి స్నేహితులు. అరేయ్..ఉరేయ్ అని పిలుచుకునేంత బాండింగ్ ఇద్దరి మధ్య ఉంది. అలాగని ఇద్దరు బాల్య స్నేహితులు కూడా కాదు. నటుడిగా తారక్ కంటే కనకాల చాలా సీనియర్. వయసులో కూడా చాలా పెద్దవాడు. మరి అలాంటి ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది? అన్నది ఇంత వరకూ ఆ ఇద్దరు ఎక్కడా చెప్పింది లేదు.
తాజాగా ఈ విషయాన్ని రాజీవ్ కనకాల రివీల్ చేసాడు. ఇద్దరి మధ్య పరిచయం 'స్టూడెంట్ నెంబర్ వన్' షూటింగ్ సమయంలో జరిగింది. అందులో తారక్ హీరో కాగా...ఓ కీలక పాత్రలో రాజీవ్ కనకాల నటించాడు. నటుడిగా సీనియర్ కావడం..వయసులో పెద్ద కావడంతో కనకాలను తారక్ సార్ అని పిలిచేవాడట. అలా పిలిస్తే 'సార్' వద్దు అని రాజీవ్ అని పిలవమన్నాడట. మరుసటి రోజు షూట్ లో తారక్ రాజీవ్ అని పిలిస్తే షాక్ అయ్యాడట.
ఏదో పిలవమన్నాని అలా పిలిచేస్తాడనుకోలేదన్నడు. హరికృష్ణ గారి అబ్బాయ్ అని సర్దుకు పోయానన్నాడు కనకాల. తర్వాత రోజు మళ్లీ రాజీవ్ గారు అని పిలిచాడట. `దీంతో చివర్లో గారు పెట్టాడని సంతోషపడ్డా. తర్వాత రోజు షూట్ లో బిల్డింగ్ పై నుంచి ఉరేయ్ రాజా అన్నాడు. రాజీవ్ గారు నుంచి రారా వరకూ వచ్చేసాడు. దీంతో వెంటనే `రా` అంటున్నావ్? ఏంటి అని సీరియస్ గా అడిగా. ప్రెండ్ అంటే రా అనకూడదా? అన్నాడు.
ఆ తర్వాత ఇద్దరు కొన్ని విషయాలతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం. అటుపై క్లోజ్ అయ్యాం. అలా తారక్ మంచి స్నేహితుడైపోయాడని తెలిపారు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించాడు. అయితే కొంత కాలంగా ఆ కాంబినేషన్ తెరపై కనిపించలేదు. దీంతో వారి స్నేహం చెడిందా? అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని రాజీవ్ కనకాల ఖండించిన సంగతి తెలిసిందే.