ఆ విషయం నాకూ తెలియడం లేదు : రామ్ చరణ్‌

ఇతర హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. కానీ చరణ్ మాత్రం మెల్లగా సినిమాలు చేస్తున్నాడు.

Update: 2025-01-04 11:03 GMT

రామ్‌ చరణ్‌ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌ సినిమాతో రాబోతున్నారు. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్‌ చరణ్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నటించడం ద్వారా తన కల సాకారం అయ్యింది అంటూ చెప్పుకొచ్చిన రామ్‌ చరణ్ ఒక మంచి పవర్ ఫుల్‌ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. ఇతర హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. కానీ చరణ్ మాత్రం మెల్లగా సినిమాలు చేస్తున్నాడు.

ఈ విషయమై ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ను ఈ విషయమై ఒక రిపోర్టర్‌ ప్రశ్నించిన సమయంలో తాను ఏడాదికి రెండు సినిమాలతో రావాలని కోరుకుంటున్నాను. తన నుంచి ఏడాదికి రెండు సినిమాలు వస్తాయని ప్రతి సారి అనుకుంటాను. కానీ ఏదో కారణం వల్ల సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు కూడా తెలియడం లేదు అంటూ రామ్‌ చరణ్ పేర్కొన్నాడు. కానీ ఈ ఏడాది నుంచి అయినా రెండు సినిమాలతో వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాదిలో బుచ్చిబాబు సినిమాతో చరణ్ వస్తాడా అనేది చూడాలి.

గేమ్‌ ఛేంజర్‌ సినిమాపై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంతే కాకుండా ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా దిల్‌రాజు విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్‌ కి పెట్టిన మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. ముందు ముందు రాబోతున్న వసూళ్లు ఆయనకు లాభాలుగా టాక్‌ వినిపిస్తుంది.

బుచ్చిబాబు సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఆ సినిమాలో రామ్‌ చరణ్ స్పోర్ట్స్ పర్సన్‌గా కనిపించబోతున్నాడు. ఈ ఏడాదిలోనే రామ్‌ చరణ్ ఆ సినిమాతో వస్తే ఫ్యాన్స్‌కి ఈ ఏడాది డబుల్‌ ధమాకా అనడంలో సందేహం లేదు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిస్తే రామ్‌ చరణ్‌ నుంచి మరిన్ని భారీ చిత్రాలు, వరుసగా ఏడాదికి రెండు చొప్పున వస్తాయి అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ విడుదలైన వెంటనే బుచ్చిబాబు సినిమా కొత్త షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నాడు.

Tags:    

Similar News