సోలో పాన్ ఇండియా కోసం చరణ్ రాజీ లేని పోరాటం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- స్టార్ మేకర్ సుకుమార్ అనూహ్యంగా దుబాయ్ లో కనిపించడంతో? నెట్టింట రచ్చ మొదలైన సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- స్టార్ మేకర్ సుకుమార్ అనూహ్యంగా దుబాయ్ లో కనిపించడంతో? నెట్టింట రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఇద్దరు తమ ప్రాజెక్ట్ డిస్కషన్ లో భాగంగానే దుబాయ్ లో సిట్టింగ్ వేసినట్లు మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కించాయి. ఆర్సీ 16 పూర్తి కాకుండానే ఆర్సీ 17 కూడా పట్టాలెక్కించే ప్లాన్ లో భాగంగానే ఇద్దరు దుబాయ్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని ప్రచారం జరిగింది.
అయితే అదంతా అవాస్తవమని తెలుస్తోంది. ఇద్దరు దుబాయ్ కి వెళ్లింది స్టోరీ డిస్కషన్ కోసం కాదట. ఓ సెలబ్రిటీ ఫ్యామిలీ ఈవెంట్ కు హాజరయ్యేందుకు వెళ్లినట్లు తెలిసింది. రామ్ చరణ్-సుకుమార్ ఇద్దరు వేర్వేరు రోజుల్లో అక్కడికి చేరుకున్నారే తప్ప అంతకు మించి ఎలాంటి సినిమా డిస్కషన్ ఇద్దరి మధ్య జరగలేదు అన్నది తాజా సమాచారం. రామ్ చరణ్ ఆర్సీ 16కి బ్రేక్ ఇచ్చి మరీ దుబాయ్ వెళ్లడంతో ఏదో ముఖ్యమైన పనే అనుకున్నారంతా. కానీ ఇలా ఓ వేడుక కోసం వెళ్లారన్నది ఇప్పుడే తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఫోకస్ అంతా ఆర్సీ 16పైనే ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చరణ్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దుబాయ్ ట్రిప్ ముగించుకుని వచ్చిన అనంతరం చరణ్ షూట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. చరణ్ ఈ సినిమా పూర్తిచేసే వరకూ మరో ప్రాజెక్ట్ పై దృష్టి సారించే అవకాశం లేదు.
ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అంతే శ్రద్దగా చేయాలి. గత సినిమా `గేమ్ ఛేంజర్` తో సంచలనం అవుదామనుకుంటే? అది డిజాస్టర్ అయింది. దీంతో చరణ్ కి సోలో పాన్ ఇండియా సక్సెస్ ఇంకా దూరంగానే ఉన్నాడు. ఆర్సీ 16 తో అది ప్రూవ్ అవుతుందని ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నాడు.