పెళ్లాంలోంచి దెయ్యాన్ని బయటకు లాగుతున్నాడు!
అప్పట్లో అతడు ధనార్జనే ధ్యేయంగా కొన్ని సినిమాలు తీసాడని విమర్శలు వెల్లువెత్తాయి.
ఆర్జీవీ ఏం చేసినా అది సంచలనమే. ఇంతకుముందు 'దెయ్యం' అనే సినిమా తీశాడు. ఆ సినిమాతో హారర్ బాట పట్టిన ఆర్జీవీ, కొన్ని చెత్త సినిమాలతో తన ఇమేజ్ కి తనే తూట్లు పొడిచాడు. హారర్ జానర్ లోనే ఐస్ క్రీమ్ అనే నాశిరకం సినిమా తీసి పేరు చెడగొట్టుకున్నాడు. అప్పట్లో అతడు ధనార్జనే ధ్యేయంగా కొన్ని సినిమాలు తీసాడని విమర్శలు వెల్లువెత్తాయి.
ఇటీవల పొలిటికల్ సెటైర్లు తీస్తూ వివాదాల్లో నలుగుతున్నాడు. ఏపీ రాజకీయాల్ని, అక్కడ నాయకుల్ని కెలుకుతూ తెరకెక్కించిన `వ్యూహం`ని రిలీజ్ కి తేవడం కోసం చాలా అష్టకష్టాలు పడ్డాడు. వ్యూహం తర్వాత శపథం కూడా తీసాడు. ఎన్నికల కోడ్ వచ్చేసింది గనుక ఇప్పుడు వేరే రకం సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టాడు. తాజాగా `నా పెళ్లాం దెయ్యం` అనే సినిమాని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. పోస్టర్ ని కూడా విడుదల చేసాడు. ఈ పోస్టర్ లో ఒక మహిళ వంట చేస్తూ కిచెన్ లో దూరంగా బ్లర్ లో కనిపించింది. అయితే తన మెడలో ఉండాల్సిన శతమానం ఎక్కడికో విసిరేసినట్టు స్పష్టంగా కనిపించింది. ఈ ఒక్క పోస్టర్ చాలు మంటలు పెట్టడానికి. నేటి జనరేషన్ స్త్రీ ఆలోచనలను, చేష్టలను అతడు టచ్ చేయబోతున్నాడని వందశాతం హింట్ ఇచ్చింది ఈ పోస్టర్. అతడు ఈసారి చెడ్డ భార్యలపై ఫోకస్ చేసాడనేందుకు ఇది క్లూ..!
ఆర్జీవీ పోస్టర్ తోనే మరోసారి అమాంతం వేడి పెంచాడు. ఇది మహిళలోని చీకటి కోణాన్ని బయటికి తీసే ప్రయత్నమా? అంటూ గుసగుసలు మొదలయ్యాయి. నేటి సమాజంలో భర్తను పట్టించుకోని భార్య కథ చెబుతాడా? లేక నా పెళ్లాం `దెయ్యం`! అన్నాడు గనుక హారర్ జానర్ ని టచ్ చేస్తున్నాడా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. పెళ్లాడిన ప్రతి మగాడూ పెళ్లాన్ని దెయ్యం అనే అంటాడు. నా పెళ్లాం గోల్డ్ అనేవాళ్లు ఈరోజుల్లో చాలా అరుదు. అందువల్ల ఈ టైటిల్ ని ఎంపిక చేసుకుని పెళ్లాంలోని దెయ్యం లక్షణాలను మాత్రమే చూపిస్తున్నాడా? లేదా బ్లర్ లో కనిపిస్తున్న మహిళ నిజంగానే దెయ్యమా? అన్నది ఆర్జీవీ క్లారిటీ ఇస్తే కానీ తేలదు. ఇంతకీ తాళిబొట్టును అలా కిచెన్ లో దూరంగా విసిరిపారేసిందా? లేక అక్కడ ఉంచిందా? అన్నదానికి కూడా ఆర్జీవీ సమాధానం చెప్పాలి.
వాస్తవంగా `వ్యూహం` ప్రమోషన్స్ లోనే `నా పెళ్ళాం దెయ్యం` పేరుతో ఓ సినిమా తీయబోతున్నానని ఆర్జీవీ చెప్పాడు. ఈ మూవీలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని, ఆ తర్వాత తన పెళ్ళాం దెయ్యంగా మారుతోందని తెలుసుకుంటాడంటూ కథ కూడా రివీల్ చేసాడు. పెళ్లి చేసుకున్న ప్రతి మగాడూ పెళ్ళాం దెయ్యమనే అంటారని, తనకూ నిజ జీవితంలో అలాగే అనిపించిందని కూడా ఆర్జీవీ అన్నాడు. ఓవరాల్ గా పెళ్లాంలోని దెయ్యం కోణాన్ని అతడు నిర్భయంగా బయటకు తీయబోతున్నాడని కూడా అతడి మాటలను బట్టి అర్థమవుతోంది.