దేశభక్తి నేపథ్యంలో 'రామ్'.. రిపబ్లిక్ డేకి రిలీజ్!
ఇక టాలీవుడ్ నుంచి అలాంటి ఓ దేశభక్తి చిత్రం ఈ రిపబ్లిక్ డే కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దేశభక్తిపై తెరకెక్కే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మామూలుగా అయితే బాలీవుడ్ లో ఈ జానెర్ లో ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. ప్రతి ఏడాది బాలీవుడ్ మేకర్స్ కచ్చితంగా ఓ పేట్రియాటిక్ మూవీని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక మన టాలీవుడ్ లో అయితే చాలా అరుదుగా వస్తుంటాయి. ఇక టాలీవుడ్ నుంచి అలాంటి ఓ దేశభక్తి చిత్రం ఈ రిపబ్లిక్ డే కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆ సినిమా పేరే రామ్(RAM/ రాపిడ్ యాక్షన్ మిషన్)'.. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు.
ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
క్రమంలోనే జనవరి 26న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. పేట్రియాటిక్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రామచందర్ సాయికుమార్ రోహిత్ సుమలేఖ సుధాకర్ రవి వర్మ మీనా వాసు అమిత్ కుమార్ ది వారి భాష తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సాయికుమార్, శుభలేఖ సుధాకర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించడం సినిమాకి మరింత ప్లస్ అని చెప్పాలి. ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ధరణ్ సుక్రే సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత పేట్రియాటిక్ జోనర్ లో వస్తున్న రామ్(RAM/ ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.