రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నెల్..తుది నిర్ణ‌యం త‌న‌యుడిదే!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ - రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నంద‌న్ ఎంట్రీ గురించి మెగా అభిమానులు, జ‌న‌సైనికులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే.

Update: 2025-01-05 14:39 GMT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ - రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నంద‌న్ ఎంట్రీ గురించి మెగా అభిమానులు, జ‌న‌సైనికులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అకీరా హీరోయిక్ మెటీరియ‌ల్. అందులో ఎలాంటి డౌట్ లేదు. అత‌డితో పాన్ ఇండియాలో సినిమా తీస్తే అద్భుత‌మే అవుతుంద‌నే విశ్లేష‌ణ‌లు ఇప్ప‌టికే తెర‌పైకి వ‌చ్చాయి. కానీ అకీరా ఎంట్రీ ఇంకా క‌న్ప‌మ్ అవ్వ‌లేదు. అత‌డు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే అకీరా వ‌య‌సు 20 దాటింది. హీరో అవ్వ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. దీంతో ఓ మీడియా స‌మావేశంలో అకీరా త‌ల్లి రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. కుమారుడు ఎంట్రీ కోసం ఓ త‌ల్లిగా తాను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. ఎప్పుడు వ‌స్తాడు? అన్న‌ది త‌న చేతుల్లో లేద‌ని కూడా స్ప‌ష్టం చేసారు. అది పూర్తిగా త‌న ఇష్టం మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. అయితే ఇంత వ‌ర‌కూ అకీరా ఎంట్రీ విష‌యంలో ఓ స‌స్పెన్స్ ఉండేది.

అకీరాకి మ్యూజిక్ అంటే ఆస‌క్తి. ఈ నేప‌థ్యంలో సినిమాల్లోకి వ‌చ్చినా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడు త‌ప్ప హీరో ఎలా అవుతాడ‌నే వారు. కానీ ఇప్పుడా సీన్ క‌నిపించ‌లేదు. మామ్ సైతం హీరోగానే ఎంట్రీ ఇస్తాడ‌ని సంకేతాలు ఇచ్చారు. కాబ‌ట్టి ఇక నిర్ణ‌యం అకీరా చేతుల్లోనే ఉంది. తండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఎంతో కాలం సినిమాల్లో కొన‌సాగే అవ‌కాశం కూడా లేదు. అతడి దృష్టంతా ప్ర‌జా సేవ మీద‌నే ఉంది. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు.

2029 నాటికి ఆయ‌న పూర్తిగా బిజీ అయిపోతారు. ఈలోగా అకీరా ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటుకోవాలి. ఎందుకంటే అకీరా అంటే ఇమేజ్ ఉన్నా సొంత ట్యాలెంట్ పైనే పైకి రావాలి. ప‌వ‌న్ స‌హాకారం పెద్ద‌గా ఉండ‌దు. చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ఎదిగిన‌ట్లే అకీరా కూడా ఇండ‌స్ట్రీలో ఎద‌గాల్సి ఉంటుంది. మ‌రీ అకీరా అంత‌టి సామ‌ర్ధ్యుడా కాదా? అన్న‌ది కాలా నిర్ణ‌యిస్తుంది.

Tags:    

Similar News