సల్మాన్‌పై మోహన్ లాల్ పైచేయి
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సికందర్ ఇటీవల విడుదలై దారుణ ఫలితం అందుకుంది.;

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సికందర్ ఇటీవల విడుదలై దారుణ ఫలితం అందుకుంది. ఈ సినిమా ఏడు రోజుల్లో కనీసం 100 కోట్ల క్లబ్ లో చేరలేని దుస్థితి. భారతదేశాన్ని ఏలిన ఖాన్ ల దూకుడు ఇటీవల ఏమైంది? అన్న చర్చా దీంతో మరోసారి మొదలైంది. అమీర్ కాన్ లాల్ సింగ్ చడ్డా ఇదే తరహాలో దారుణ వైఫల్యాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సికందర్ పరిస్థితి దారుణంగా మారింది.
మరోవైపు సల్మాన్ సికందర్ తో పాటు విడుదలైన మలయాళ చిత్రం `ఎల్ 2 - ఎంపురాన్` (లాల్, పృథ్వీరాజ్ హీరోలు) 200 కోట్ల క్లబ్ ని సునాయాసంగా అధిగమించి ఇప్పటికే 250 కోట్లు పైగా వసూలు చేసింది. ఆ రకంగా సల్మాన్ పై ఒక సౌత్ స్టార్ పైచేయి సాధించడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు 1000 కోట్ల క్లబ్ హీరోలుగా సంచలనాలు సృష్టించగా, దీనిని అందుకోవడంలో సల్మాన్ తడబడడమే కాదు.. కనీసం 100కోట్ల దిగువకు అతడి గ్రాఫ్ పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
సల్మాన్ ఖాన్ ఒక్కో చిత్రానికి రూ.100 కోట్లకు పైగా తీసుకుంటారని టాక్ ఉంది. అలాంటిది సికందర్ 100కోట్లు కూడా వసూలు చేయలేదు. దీంతో కనీసం అతడి పారితోషికం అయినా వసూలవ్వలేదని నెటిజనులు జోక్ చేస్తున్నారు. సికందర్ నిర్మాతలు ప్రస్తుతం మల్టీప్లెక్స్ చెయిన్ లతో ఒప్పందాలు రద్దు చేసుకుని, వీలైనంత త్వరగా సినిమాను OTTలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నష్టాల నుంచి రికవరీ కోసం ఇది ఒక కంటితుడుపు ప్రయత్నం. ఈ ఫలితం తర్వాత సల్మాన్ తన బ్లాక్ బస్టర్ మూవీ `బజరంగి భాయిజాన్` సీక్వెల్ పై దృష్టి సారించారని, విజయేంద్ర ప్రసాద్ తో మంతనాలు సాగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.