స్టార్ హీరో సినిమా పైరసీ వెనుక బిష్ణోయ్ గ్యాంగ్!
ఎలాంటి సినిమా అయినా నేడు పైరసీకి గురవ్వడం అన్నది సహజంగా మారిపోయింది. అరికట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు;

ఎలాంటి సినిమా అయినా నేడు పైరసీకి గురవ్వడం అన్నది సహజంగా మారిపోయింది. అరికట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. పైరసీ ఏదో రూపంలో జరుగుతూనే ఉంది. నిర్మాతలు లబోదిబో మన్నా? లాభం లేకపోతుంది. ఇక సినిమా రిలీజ్ అవ్వకుండానే పైరసీ చేస్తామని ముందే హెచ్చిరించి పైరసీకి పాల్పడతే మనల్ని ఎవరో టార్గెట్ చేసారని అర్దం. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకుంటే సన్నివేశం ఇలాగే ఉంటుంది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన `సికందర్` నేడు థియటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కొన్ని గంటలే ముందే పైరసీకి గురైంది. ఏకంగ్ హెచ్ డీ ప్రింట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో యూనిట్ షాకైంది. ఇలా జరిగిందేంటని తలలు పట్టుకుంటుంది. అయితే పైరసీ చేస్తామని రిలీజ్ కి మూడు రోజుల ముందే హెచ్చరిక వచ్చింది. కానీ ఇవన్నీ ఫేక్ అనుకున్నారు టీమ్.
కానీ అవే నిజం చేసిందా సంస్థ. దీంతో సల్మాన్ ఖాన్ యూనిట్ సభ్యుల మీద సీరియస్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తమ వల్లే ఇలాజరిగిందని వార్నింగ్ ఇచ్చారుట. మరి ఈ అనుమానం వెనుక నిజమెంతో తెలియాలి. ఇది నిజంగా యూనిట్ పనా? ఇంకేవరి పనా? అన్నది నిగ్గు తేలాల్సి ఉంది. అయితే సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని బెదిరింపులు కూడా ఎదుర్కున్నారు.
రెండు మూడు నెలల పాటు పోలీస్ నిఘా వ్యవస్థలోనే సల్మాన్ పనిచేయాల్సి వచ్చింది. ఇంటి చుట్టూ పహారా...బయటకు వెళ్లాలంటే భద్రతా దళలా మధ్యనే వెళ్లాల్సి వచ్చింది. మరి సల్మాన్ ఖాన్ ని ఇంతగా టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ సికిందర్ పైరసీ విషయంలో ఇన్వాల్వ్ అయిందా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. ముఠా గ్యాంగ్ సభ్యుడు ఎవరినైనా బెదిరించి ఈ చర్యలకు పాల్పడ్డాడా? అన్న సందే హాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిగ్గు తేల్చాల్సింది సైబర్ క్రైమ్. మరి ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.