ఆ హీరో సరదాగా అన్నా! నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్!
ఒక్కసారి షారుక్ ఖాన్ నటించిన `దేవదాస్` లోకి వెళ్లే... సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన మరో గొప్ప చిత్రమది.
`దేవదాస్` అనే సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఓ బ్రాండ్ మూవీగా నిలిచింది. తెలుగులో చేసినా...హిందీలో చేసినా ఇంకెక్కడ చేసినా? దేవదాస్ అంటే ఓ సంచలనమైన చిత్రం. పాత తరం `దేవదాస్` తర్వాత మళ్లీ తెలుగు..హిందీలోనూ అదే టైటిల్ తో కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక్కసారి షారుక్ ఖాన్ నటించిన `దేవదాస్` లోకి వెళ్లే... సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన మరో గొప్ప చిత్రమది.
షారుక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అది. 2002 లో ఈ సినిమా రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ అనుభవాల్ని షారుక్ ఖాన్ పంచుకున్నారు. `దేవదాస్` సినిమాచేయడానికి కారణం అమ్మ. ఆ సినిమాలో నా నటన చూసి ఆమె గర్వపడాలనుకున్నా. దిలీప్ కుమార్, కె.ఎల్ సైగల్ వంటి నటులు ఆ పాత్రలు పోషించారు. వారిలా నేను నటించలనేని చాలా మంది నన్ను దేవదాస్ అంగీకరించొద్దు అన్నారు.
కానీ ఈ సినిమాలో నేను నటించాలని పట్టుబట్టాను. దేవదాస్ రిలీజ్ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ నా మీద ప్రశంసలు కురిపించారు. కానీ ఆ సినిమా రిలీజ్ సమయంలో నేను ఎంతో ఆందోళనకు గురయ్యాను. మద్యం తాగడం అలవాటు చేసుకున్నా. బహుశా ఆ అలవాటే నాకు ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిందేమో` అని షారుక్ ఖాన్ సరదాగా అన్నారు.
`దేవదాస్` లో ఐశ్వర్యారాయ్- మాధురి దీక్షిత్ లు హీరోయిన్లగా నటించారు. షారుక్ ఖాన్ తల్లిదండ్రులు కెరీర్ ప్రారంభానికి ముందే కన్నుమూసారు. తల్లిదండ్రులు లేకపోవడంతో షారుక్ ఖాన్ అనేక సందర్భాల్లో ఆవేదన చెందారు. అందుకే షారుక్ ఖాన్ బాలీవుడ్ పెద్దవారైన అమితాబచ్చన్-జయాబచ్చన్ లాంటి వారు తారస పడినప్పుడు కాళ్లకు నమస్కరిస్తుంటారు.