పిక్‌టాక్‌ : స్పైడర్‌మాన్‌తో 'సాహో' బ్యూటీ

ప్రభాస్‌తో సాహో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ తాజాగా సౌదీ అరేబియాలో జరుగుతున్న రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.

Update: 2024-12-10 06:03 GMT

ప్రభాస్‌తో సాహో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ తాజాగా సౌదీ అరేబియాలో జరుగుతున్న రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. గత రాత్రి రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై శ్రద్దా కపూర్‌ నడుస్తూ ఇండియన్‌ సినిమాకి ప్రాతినిధ్యం వహించారు. శ్రద్దా విభిన్నమైన ఫల్గుణీ పీకాక్‌ డిజైన్‌తో పాటు, స్టైలిష్‌ మేకోవర్‌లో కనిపించి కన్నుల విందు చేశారు. రెడ్‌ కార్పేట్‌పై శ్రద్దా కపూర్‌కి అనూహ్యంగా హాలీవుడ్‌ స్టార్‌ ఆండ్రూ గార్ఫీల్డ్‌తో ఫోటోలకు ఫోజ్‌లు ఇచ్చే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సిరీస్‌ స్పైడర్‌మాన్‌ తాజా సిరీస్ నటుడు ఆండ్రూ గార్ఫీల్డ్‌తో కలిసి రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్‌ కార్పెట్‌పై నడిచిన శ్రద్దా కపూర్‌ తన ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలను కొందరు నమ్మలేక పోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తే మరికొందరు ఇది హర్రర్‌ సినిమా మాయలాగా అనిపిస్తుందని, నువ్వు మరోసారి స్త్రీ 2 సినిమాలోని మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నావా అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. మొత్తానికి ఆండ్రూ గార్ఫీల్డ్‌తో శ్రద్దా కపూర్‌ ఇచ్చిన రెడ్‌ కార్పెట్‌ ఫోటోలకు మంచి స్పందన లభించింది.


బాలీవుడ్‌ స్టార్‌ శక్తి కపూర్‌ నట వారసురాలు శ్రద్దా కపూర్‌. 2010లో టీన్‌ పత్తి సినిమాలో చిన్న పాత్రలో నటించడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. నటిగా లవ్ కా ది ఎండ్‌ అనే సినిమాలో పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు, అదీ ఎక్కువ మంది స్టార్స్‌తో సినిమాలు చేసిన ఘనత దక్కించుకుంది. గత పది సంవత్సరాలుగా బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న విషయం తెల్సిందే. ఈమెకు ఎన్నో అవార్డులు, రికార్డులు, రికార్డులు సైతం సినిమాలతో దక్కాయి. సోషల్‌ మీడియాలోనూ ఈమె ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది.

ఆషికి 2 సినిమాతో 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రద్దా కపూర్‌ అందులో కనబర్చిన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు, ఏకంగా ఫిలింఫేర్‌ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా దక్కించుకుంది. ఈమె ఇటీవల స్త్రీ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం సక్సెస్‌ కోసం కిందా మీదా పడుతున్న ఈ సమయంలో శ్రద్దా కపూర్‌ చాలా ఈజీగా స్త్రీ 2 సినిమాతో వందల కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. స్త్రీ 2 సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆమె నుంచి రాబోతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News