జాక్ పెద్ద టార్గెట్ తోనే వస్తున్నాడా..?
సిద్ధు జాక్ ఏప్రిల్ 10న వస్తుంది. ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటివరకు సిద్ధు సినిమాల్లో హైయెస్ట్ అని తెలుస్తుంది.;

గుంటూర్ టాకీస్ సినిమాతో మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వచ్చిన ప్రతి ఛాన్స్ ని కాదనకుండా చేస్తూ వచ్చాడు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా భయపెట్టాడు సిద్ధు. అలాంటి అతను హీరోగా మారి క్రిష్ణా అండ్ హిస్ లీలా సినిమా చేయగా ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత డీజే టిల్లుగా దుమ్ముదులిపేశాడు. ఒక్కసారిగా సిద్ధు టాలెంట్ ఏంటో ఆడియన్స్ ని అర్ధమయ్యింది.
డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో టిల్లు స్క్వేర్ అంటూ ఆ సినిమా సీక్వెల్ గా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సిద్ధు. ఈ సినిమా అయితే చెప్పి మరీ సూపర్ హిట్ కొట్టాడు సిద్ధు. రెండు హిట్ సినిమాల తర్వాత సిద్ధు నెక్స్ట్ సినిమా మీద చాలా హోప్స్ ఉంటాయి. అంతేకాదు 100 కోట్ల హీరో కాబట్టి బిజినెస్ లెక్కలు కూడా భారీగా ఉంటాయి.
సిద్ధు జొన్నలగడ్డ త్వరలో జాక్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా బేబీ విష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. జాక్ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సిద్ధు ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. ఐతే ఆడియన్స్ కు టిల్లు రోల్ లో బాగా ఎక్కేసిన సిద్ధు ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి జాక్ గా మెప్పించాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా టఫ్ టాస్కే అయినా జాక్ చూసిన ఆడియన్స్ టిల్లుని మర్చిపోతారు అన్న రేంజ్ లో కాన్ ఫిడెన్స్ ఇస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.
సిద్ధు జాక్ ఏప్రిల్ 10న వస్తుంది. ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటివరకు సిద్ధు సినిమాల్లో హైయెస్ట్ అని తెలుస్తుంది. మరి సిద్ధు ఈ జాక్ తో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. సిద్ధు మార్క్ ఎంటర్టైనర్ తో పాటు మంచి కథ ఉంటే మాత్రం జాక్ సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క.
ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా తన పాత్ర చాలా బాగుంటుందని స్పెషల్ గా చెబుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో హీరోయిన్ పాత్రలు నిజంగానే కథను నడిపిస్తాయి మరి ఈ జాక్ విషయంలో ఎలా ఉంటుందో చూడాలి. జాక్ తర్వాత నెక్స్ట్ తెలుసు కదా సినిమాతో రాబోతున్నాడు సిద్ధు. ఆ సినిమా కూడా తన మార్క్ మూవీగా సూపర్ ఫన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని టాక్.