సితార చేతికి కూలీ.. అప్పుడు రూ.9 కోట్లు.. మరి ఇప్పుడు?
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో సిద్ధమవుతున్న కూలీ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, టాలీవుడ్ కింగ్ నాగార్జున తో పాటు శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ కథాంశంతో సిద్ధమవుతున్న కూలీ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమాపై హైప్ పెంచేసింది. దీంతో మూవీ అప్డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా చెన్నై ఎయిర్ పోర్ట్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసిన మేకర్స్.. త్వరలోనే వైజాగ్, హైదరాబాద్ లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ చేయనున్నారు. అలా మార్చి కల్లా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరలో గ్లింప్స్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే కార్మికుల దినోత్సవం నాడు.. అంటే మే 1వ తేదీన సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ చేయాలని చేస్తున్నారట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని వినికిడి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడం సాధ్యం కాదనే మే నుంచి ఆగస్టుకు రిలీజ్ ను షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కూలీ మూవీని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ.. సితార ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డీల్ కూడా కుదిరినట్లు సమాచారం.
అయితే లోకేష్ కనగరాజ్... దళపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన లియో మూవీని కూడా సితార సంస్థే రిలీజ్ చేసింది. 2023లో విడుదలైన ఆ చిత్రం.. సూపర్ హిట్ గా నిలిచింది. రూ.20 కోట్లకు తెలుగు రైట్స్ ను కొనుగోలు చేయగా.. సితార సంస్థకు రూ.9 కోట్ల లాభాలు వచ్చాయి. ఇప్పుడు కూలీ మూవీపై పాజిటివ్ బజ్ ఇప్పటికే క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా ఇంకెంత లాభాలు తీసుకురానుందో వేచి చూడాలి.