శోభితా ధూళిపాల ELLE కవర్ షూట్
శోభిత ప్రతి ఫ్రేమ్ లో బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్ ఆత్మవిశ్వాసం అబ్బురపరుస్తున్నాయి
శోభితా ధూళిపాల నిస్సందేహంగా నేటితరం జెన్ జెడ్ స్టైల్ ఐకాన్. చీరలు, లెహంగాలు లేదా సమకాలీన డిజైనర్ దుస్తుల్లో శోభిత స్టైల్ ఎలివేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు వివాహ సీజన్ కోసం ELLE ఇండియా కోసం ప్రత్యేక కవర్ షూట్ లో పాల్గొంది శోభిత. భారతీయ వివాహ నైతికతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన స్పెషల్ ఫోటోషూట్ ఇది. శోభిత ప్రతి ఫ్రేమ్ లో బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్ ఆత్మవిశ్వాసం అబ్బురపరుస్తున్నాయి. తాజాగా శోభిత ఎల్లే ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోషూట్ లో క్లాసిక్, ఓల్డ్-స్కూల్ గ్లాం ఫ్యానటిక్స్ .. 2023లో అత్యంత అధునాతనమైన షాంపైన్ - ఐవరీలో హెవీ డ్యూటీ లెహెంగాలో శోభిత కనిపించింది. పబ్లిక్ ఈవెంట్లలో లుక్ కి భిన్నమైన సాంప్రదాయక శైలితో శోభిత ఆకట్టుకుంటోంది. ఓ వైపు నటవృత్తి మరోవైపు ఫ్యాషన్ రంగంలో శోభిత ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది.
నిజానికి చాలామంది నటీనటులు వెండితెరను ఇష్టపడతారు. ఇటీవల OTT సిరీస్ `మేడ్ ఇన్ హెవెన్`తో శోభిత పేరు మార్మోగింది. మన చుట్టూ ఉన్న ప్రభావాలు.. మన జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతిస్పందనగా మనమంతా నిరంతరం మారుతున్నామని నేను నమ్ముతున్నాను! అని శోభిత తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఏడేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించినప్పటికి ఇప్పటికి తనలో ఎంతో మార్పు కనిపిస్తోంది.
2016లో అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0లో తెరంగేట్రం చేసినప్పటి నుండి శోభిత కెరీర్ జర్నీ అనూహ్యమైన మలుపులు తిరిగింది. గూఢచారి- మేజర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్బుత నటనతో ఆకట్టుకుంది శోభిత. నటిగా ఫ్యాషనిస్టాగా బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనంగా ఎదిగింది ఈ బ్యూటీ. ఇటీవలే రామ్ చరణ్ తో కలిసి ఓ ప్రకటనలో నటించగా, అందమైన పెయిర్ అంటూ అభిమానులు పొగిడేశారు. చరణ్ సరసనా శోభిత నటించాలని మెగాభిమానులు కోరుకున్నారు. మునుముందు టాలీవుడ్ అగ్ర హీరోల సరసనా శోభిత నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి అవకాశాల కోసమే తాను కూడా ఎదురు చూస్తోంది.