బాలీవుడ్ రొమాంటిక్ మూవీలో శ్రీలీల
ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్‌లో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ జాబితాలో ముందు వరుసలో ఉంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌లో యంగ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇటీవలే తమిళ్‌లో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న పరాశక్తి సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. కోలీవుడ్‌లో మొదటి సారి నటించబోతున్న ఈ అమ్మడు త్వరలోనే హిందీలోనూ ఈ అమ్మడు ఒక సినిమాను చేయబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్‌లో రొమాంటిక్ మ్యూజికల్ ఆషికి ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు పార్ట్‌లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఆషికి 3 సినిమాను ప్రకటించారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషికి 3 సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యి షూటింగ్ ప్రారంభం అయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నీ బోల్డ్ పాత్రలే కావడంతో ఆషికి 3 కి ఆ ఇమేజ్ తప్పుగా వెళ్తుందేమో అనే ఉద్దేశ్యంతో తప్పని సరి పరిస్థితుల్లో త్రిప్తి డిమ్రీని తొలగించారని సమాచారం అందుతోంది.
ఆషికి 3 నుంచి త్రిప్తి డిమ్రీ తప్పుకోవడం కన్ఫర్మ్ అయ్యింది. ఆమె స్థానంలో నటించబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బాలీవుడ్ వర్గాల్లో అనూహ్యంగా సౌత్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆషికి 3 సినిమా కోసం తెలుగు హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దర్శకుడు అనురాగ్ బసు ఇటీవల శ్రీలీలతో సంప్రదింపులు జరిపారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా శ్రీలీల అయితే బాగుంటుంది అనే అభిప్రాయంను అప్పుడే కొందరు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి కాంబోలో ఆషికి 3 వస్తే హిట్ కావడం ఖాయం అంటున్నారు.
కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఆషికి 3 సినిమాలోనే కాకుండా సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం సరసన శ్రీలీల నటించే అవకాశం ఉంది. ఆ సినిమాకు సంబంధించిన చర్చలు గతంలోనే జరిగాయి. ఒకేసారి బాలీవుడ్‌లో శ్రీలీల రెండు సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో నటించింది. అదే ఏడాది చివర్లో పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించి మెప్పించింది. ప్రస్తుతం శ్రీలీల కిట్టీలో చాలా సినిమాలే ఉన్నాయి. కనుక ముందు ముందు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు బిజీ అయితే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా ఈ అమ్మడు నిలిచిన విషయం తెల్సిందే.