నాకు నేనే పోటీ... నాకెవ్వరు పోటీ కాదు!
తాజాగా ఒక చిట్ చాట్ లో ఇండస్ట్రీ లో ఉన్న పోటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలుగు ప్రేక్షకులకు రాఘవేంద్ర రావు కొత్త 'పెళ్లి సందడి' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. మొదట కన్నడ సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం ఎక్కువ శాతం తెలుగు సినిమాలను చేస్తుంది. తమిళ్ తో పాటు ఇతర భాషల నుంచి ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఎక్కువగా తెలుగు సినిమాలకు కమిట్ అవుతూ వస్తోంది. ఈ మధ్య కాలంలో చదువు తో పాటు సినిమాలను బ్యాలెన్స్ చేసే ఉద్దేశ్యంతో గత ఏడాది కమిట్ అయినట్లుగా ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. తాజాగా ఒక చిట్ చాట్ లో ఇండస్ట్రీ లో ఉన్న పోటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ కాంపిటీషన్ కాదు. ఎవరు మంచిగా చేస్తే, ఎవరికి సక్సెస్ వస్తే వారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకుంటారు. సినిమా ఇండస్ట్రీ అనేది పుష్పక విమానం వంటిది. ఎంత మంది వచ్చినా స్వాగతం అన్నట్లుగానే ఉంటుంది. కనుక సినిమా ఇండస్ట్రీలో ఒకరి పై ఒకరు పోటీ తత్వం తో గొడవలు పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా శ్రీలీల వ్యాఖ్యలు చేసింది. నాకు నేనే పోటీ అన్నట్లుగా నటిస్తాను తప్ప, నాకు ఎవరో పోటీ, వారి వల్ల నా కెరీర్ కు ఇబ్బంది ఉంటుందేమో అనే భయం నాకు ఎప్పుడూ లేదు అంటూ శ్రీలీల చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడింది.
ట్యాలెంట్ ఉన్న వారికి కచ్చితంగా ఆఫర్లు ఉంటాయి. నాకు ఎవరి ట్యాలెంట్ నచ్చినా నేను ముందుకు వచ్చి వారికి నావంతు సహకారం అందించేందుకు రెడీగా ఉంటాను. ఇతర హీరోయిన్స్ గురించి ఎక్కువగా ఆలోచించి, వాళ్లతో పోటీ పడి సినిమాలు చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను. వాళ్ల అవకాశాల గురించి నేను ఎప్పుడూ ఆరా తీసిన దాఖలాలు లేవు. కానీ నా సినిమాల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాను. ఎంపిక చేసిన ప్రతి సినిమా కు న్యాయం చేసే విధంగా నటించాలని తాపత్రయ పడుతాను అంటూ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీల ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయింది. అయినా కూడా ప్రస్తుతం ఈమె ఖాతాలో పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది. అంతే కాకుండా నితిన్ తో ఒక సినిమాను చేస్తోంది. మరో వైపు రవితేజ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. రవితేజ తో ఇప్పటికే చేసిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకునే విధంగా ఈమె సినిమాలు ఉండబోతున్నాయని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.