SSMB29: జనవరి నుంచి ఏం ప్లాన్ చేయబోతున్నారు?

అలాగే రెండు భాగాలుగా ఈ సినిమాని రాజమౌళి చేయబోతున్నారంట. అందులో మొదటి భాగం 2027లో రెండో భాగం 2028 సంవత్సరాలలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేయబోతున్నట్లు మాట్లాడుకుంటున్నారు.

Update: 2024-12-14 18:27 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో రాజమౌళి దర్శకత్వంలో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మూవీ కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నారు.

అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథ ఉంటుందని అనుకుంటున్నారు. ఇంటర్నేషనల్ లెవల్ లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా ఆవిష్కరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబందించిన గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు.

2025లోనే ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ ని రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక ఈ మూవీకి సంబందించిన మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి జక్కన్న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.

అలాగే రెండు భాగాలుగా ఈ సినిమాని రాజమౌళి చేయబోతున్నారంట. అందులో మొదటి భాగం 2027లో రెండో భాగం 2028 సంవత్సరాలలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేయబోతున్నట్లు మాట్లాడుకుంటున్నారు. విజయాల స్పెక్టక్యులర్ గా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి కథతో ఈ మూవీని రాజమౌళి చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు.

వరల్డ్ వైడ్ గా కేవలం ఇండియన్ భాషలలోనే కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లలో కూడా ఒకేసారి ఈ సినిమా రిలీజ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులకి రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా కంటెంట్ ని చెప్పబోతున్నారంట. అయితే రాజమౌళ ఏ సినిమా చేసిన ముందుగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ ఏంటి. యాక్టర్స్ ఎవరనేది అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత షూటింగ్ షెడ్యూల్ పై క్లారిటీ ఇస్తారు. జనవరి నుంచి మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలంటే ఈ నెలలోనే ‘SSMB29’ సినిమాకి సంబందించిన జక్కన్న ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం ఉందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News